నోకియా ఫోన్ల తయారీ సంస్థ HMD నుంచి ఏప్రిల్ 29న కీలక ప్రకటన.. సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ విడుదల..!!
నోకియా ఫోన్లను తయారు చేసే HMD (Human Mobile Device) సంస్థ సొంతంగా స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ఏప్రిల్ 29 న తొలి హ్యాండ్ సెట్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు X లో పోస్టు చేసింది. గతంలోనే సంస్థ సొంత బ్రాండ్‌తో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. పల్స్ లేదా లెజెండ్ సిరీస్ పేరుతో వీటిని లాంచ్ చేస్తు్‌న్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 29న తొలి స్మార్ట్ ఫోన్!! :
భారత్‌లో ఈ హ్యాండ్ సెట్‌లు రెండు రోజుల్లో విడుదల కానుండగా.. గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే ఈ HMD స్మార్ట్ ఫోన్‌లు చేసింది. అయితే పల్స్ లేదా లెజెండ్ సిరీస్‌లలో ఏ హ్యాండ్ సెట్‌లు విడుదల కానున్నాయనే దానిపై స్పష్టత లేదు. ఏప్రిల్ 29 న ఈ సందేహాలకు చెక్ పెట్టనుంది HMD సంస్థ.

HMD పల్స్ సిరీస్ స్పెసిఫికేషన్లు :
ఈ హెచ్‌ఎండీ పల్స్ సిరీస్ 6.56 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 90Hz రీఫ్రెష్ రేట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ తో 64GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. 13MP ప్రైమరీ కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
5000mAh బ్యాటరీ :
అదే హెచ్‌ఎండీ పల్స్ + 8GB ర్యామ్‌తో 128GB అంతర్గత స్టోరేజీ, హ్యాండ్‌సెట్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాలతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే, బ్యాటరీ మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
8GB ర్యామ్ సహా 128GB స్టోరేజీ :
అదే పల్స్ ప్రో హ్యాండ్ సెట్ 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 20W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్ సెట్ 50MP కెమెరాతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్ సెట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
Unisoc T606 ప్రాసెసర్ :
అయితే ఈ HMD పల్స్ సిరీస్ అన్ని హ్యా్ండ్ సెట్‌లు Unisoc T606 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది లేదా ఏప్రిల్ 29 న పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉన్నాయి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








