రండి బాబు రండి..నెలసరి వాయిదాలు, డిస్కౌంట్ ధరలు!

Posted By: Super

రండి బాబు రండి..నెలసరి వాయిదాలు, డిస్కౌంట్ ధరలు!

 

గెలాక్సీ ఎస్3 విడుదల అనంతరం ఆ విధమైన అంచనాలతో విడుదలైన స్మార్ట్‌ఫోన్ నోకియా ప్యూర్ వ్యూ 808, 41 మెగా పిక్సల్ హై క్వాలిటీ కెమెరా ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకత. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ గరిష్ట చిల్లర ధర రూ.33,899. వినియోగదారులకు ఈ ధర చుక్కలుచూపిస్తున్న నేపధ్యంలో పలు ఆన్‌లైన్ రిటైలింగ్ సంస్థలు సులభ వాయిదా పద్ధతులతో పాటు డిస్కౌంట్ ధరలకు ప్యూర్ వ్యూ 808ను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో పలు ముఖ్యమైనవి...

ట్రేడస్:

ప్రముఖ ఈ-కామర్స్ ఆన్‌లైన్ పోర్టల్ ట్రేడస్.ఇన్, ప్యూర్ వ్యూ 808 పై రూ.2,800 తగ్గింపు ధరను ప్రకటించింది. ఈ సౌలభ్యతతో వినియోగదారు రూ. 33,899 విలువ గల సొత్తును రూ.30,995కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదండోయ్.. నెలసరి వాయిదా పద్ధతిలో డబ్బులను చెల్లించే సౌలభ్యత. దేశమంతటా ఫ్రీ హోమ్ డెలివరీ.

రెడిఫ్:

ఈ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ నోకియా ప్యూర్ వ్యూ 808ను రూ.31,800లకు ఆఫర్ చేస్తుంది. డబ్బును వాయిదా పద్ధతిలో చెల్లించే సౌలభ్యత, ప్రీ హోమ్ డెలివరీ.

బుయ్ ద ప్రైజ్:

ఈ ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ప్యూర్ వ్యూ 808ను రూ.32,000ధరకు విక్రయిస్తోంది. డబ్బును వాయిదా పద్ధతిలో 3 నుంచి 6 నెలల కాలవ్యవధిలో చెల్లించే సౌలభ్యత.

సాహాలిక్:

ఈ ఆన్‌లైన్ రిటైలర్ ప్యూర్ వ్యూ 808ను రూ.32,499కి ఆఫర్ చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఫ్రీ హోమ్ డెలివరీ.

ఇండియా ప్లాజా:

ఈ ప్రఖ్యాత ఆన్‌లైన్ రిటైలర్ డివైజ్‌ను రూ.32,990కు ఆఫర్ చేస్తోంది. డబ్బును వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం. ఫ్రీ షిప్పింగ్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot