నోకియా కొత్త ఛైర్మన్ అతనేనా..?

Posted By:

నోకియా కొత్త ఛైర్మన్ అతనేనా..?

 

నోకియా ఛైర్మన్ పదవిని కొత్త వారు సొంతం చేసుకోబోతున్నారా.. అంటే అవుననే అంటున్నారు నోకియా బోర్డ్ సభ్యులు. నోకియా బోర్డ్ సభ్యులు అందించిన సమాచారం ప్రకారం జనవరి 26వ తేదీన నోకియా కొత్త చైర్మన్‌ని ప్రకటించనుంది. ఈ ఛైర్మన్ పదవికి 2008వ సంవత్సరం నుండి బోర్డులో సభ్యునిగా కొనసాగుతున్న యాంటీ వైరస్, కంప్యూటర్ సెక్యూరిటీ ఎఫ్ - సెక్యూర్ ఫౌండర్ 'రిస్తో సిలస్మ' పేరుని ప్రతిపాదించవచ్చునని అనుకుంటున్నారు.

ప్రస్తుతం నోకియా ఛైర్మన్‌గా 'జోర్మ ఒల్లిల' కొనసాగుతున్నారు. ఈ సందర్బంలో జోర్మ ఒల్లిల మాట్లాడుతూ నోకియా ఈ నెల చివరిలో కొత్త ఛైర్మన్‌ని నియమించాలనుకున్న వార్త నిజమే నని.. ఐతే 'రిస్తో సిలస్మ' పేరు నియాకంలో ఉంటుందా లేదా అనేది తనకు తెలియదని అన్నారు. నామినేషన్ కమిటి ఎవరి పేరునైతే సూచిస్తుందో వారికే నా మద్దతు ఉంటుందని అన్నాడు. 1992వ సంవత్సరంలో సీఈవోగా నియమితులైన 'జోర్మ ఒల్లిల' 2006వ సంవత్సరం వరకు అదే పోజిషన్‌లో కొనసాగారు.

ఆ తర్వాత ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన మొబైల్ తయారీదారుగా నోకియా ఆవిర్బవించడానికి తన వంతు సహాకారం అందించినందుకు గాను 1999వ సంవత్సంలో నోకియా ఛైర్మన్ పదవిని సొంతం చేసుకున్నారు. ప్రస్తుత ఛైర్మన్ పదవికి  'రిస్తో సిలస్మ' సరైన వ్యక్తిగా పలువురు ప్రముఖులు అభివర్ణించారు. ఇందుకు కారణం మొబైల్ పరిశ్రమ గురించి  'రిస్తో సిలస్మ' సరైన అవగాహాన ఉండడమే కాకుండా, ఫిన్నిస్ మొబైల్ ఆపరేటర్ ఎలిసా కి ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

ఇక నోకియా విషయానికి వస్తే ఇటీవల కాలంలో వచ్చిన ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు గట్టి పోటీని ఇవ్వలేక పోతున్న విషయం తెలిసిందే. దీనికి గాను గట్టి పోటీని ఇచ్చేందుకు గాను నోకియా, టెక్నాలజీ గెయింట్ మైక్రోసాప్ట్‌తో 2011 ఫిబ్రవరిలో చేతులు కలిపి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి 'నోకియా లుమియా' సిరిస్ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot