Home
News

Nokia నుంచి రానున్న కొత్త ఫోన్లు! విడుదల తేదీలు ఇవే!

By Maheswara

కొంతకాలంగా, ఫ్లాగ్‌షిప్ నోకియా 9.3 ప్యూర్‌వ్యూతో సహా రాబోయే నోకియా స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి చాలా పుకార్లు మరియు ఊహాగానాలు వచ్చాయి. ఇంతకుముందు, నోకియా 9.3 ప్యూర్ వ్యూ, నోకియా 7.3, మరియు నోకియా 6.3 ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో రావొచ్చని నివేదికలు వచ్చాయి.

నెల ప్రారంభంలో

తరువాత, ప్రయోగ తేదీ నవంబర్‌లో ఉంటుందని భావించి ఉన్నప్పటికీ  HMD  గ్లోబల్ ఈ నెల ప్రారంభంలో నోకియా 8 V 5 G, నోకియా 8000 మరియు నోకియా 6000 స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా, కొత్తగా ప్రకటించిన నోకియా 2.4, నోకియా 3.4 లను నవంబర్ 26 న భారత్‌కు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

రాబోయే నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

రాబోయే నోకియా స్మార్ట్‌ఫోన్‌లు

ఇప్పుడు, నోకియా పవర్ యూసర్ నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, నోకియా 9.3 ప్యూర్ వ్యూ, నోకియా 7.3 5G మరియు నోకియా 6.3 స్మార్ట్‌ఫోన్‌లను 2020 చివరి నాటికి లాంచ్ చేయవచ్చని సూచించింది. ఇంతకుముందు, ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల యొక్క లీకైన ధర మరియు ఫీచర్లను  మనము చూశాము. ఈ స్మార్ట్‌ఫోన్‌ల కోసం అధికారిక ప్రయోగ తేదీ కోసం మాత్రమే ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ రాబోయే ఫోన్లలో ఏమి ఆశించవచ్చు ?

ఈ రాబోయే ఫోన్లలో ఏమి ఆశించవచ్చు ?

నోకియా 9.3 ప్యూర్ వ్యూ, 6.29-అంగుళాల క్వాడ్ HD + P-OLED డిస్ప్లేతో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు వేగవంతమైన 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుందని నమ్ముతున్నారు. ఈ పరికరం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 865 SoC నుండి అడ్రినో 650 GPU తో జతకట్టింది, 8GB RAM వరకు మరియు 256GB వరకు నిల్వ సామర్థ్యము కలిగి ఉంటుంది.

ఇది ఆండ్రాయిడ్ 11 OS సాన్స్ ఏ కస్టమైజేషన్ తో నడుస్తుంది మరియు గతం లో వచ్చిన ఫోన్ల  మాదిరిగానే పెంటా-లెన్స్ కెమెరా అమరిక తో ఉంటుంది. అయితే, కెమెరా మాడ్యూల్ 108 ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64 ఎంపి ప్రైమరీ సెన్సార్  కలిగి ఉంటుంది. ఈ పరికరం యొక్క ఇతర మంచి ఫీచర్లలో Qi వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 48MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌ మరియు 4500mAh బ్యాటరీ ఉండవచ్చు.

నోకియా 7.3

నోకియా 7.3

మరోవైపు, లీకైన నోకియా 7.3 ఫీచర్ల ప్రకారం స్మార్ట్‌ఫోన్ పంచ్-హోల్ కటౌట్, వృత్తాకార కెమెరా మాడ్యూల్, వెనుక భాగంలో అమర్చిన వేలిముద్ర సెన్సార్ మరియు 5 జికి మద్దతుతో స్నాప్‌డ్రాగన్ 690 SoC తో రావచ్చని చూపిస్తుంది.  48MP మెయిన్ కెమెరా సెన్సార్, 24MP సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తో రావొచ్చని చెబుతున్నారు. చివరగా, నోకియా 6.3 ఒక స్నాప్‌డ్రాగన్ 730 SoC మరియు 24MP ప్రాధమిక సెన్సార్‌తో క్వాడ్-కెమెరా సెటప్ తో రావొచ్చని అంచనా.

Best Mobiles in India

English summary
Nokia's Upcoming Smart Phones Launch Dates Revealed.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X