Wi-Fi Calling ను అనుమతిస్తున్న నోకియా,ఈ ఫోన్ల లో మాత్రమే

|

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తన నోకియా స్మార్ట్‌ఫోన్‌ల మీద VoWi-Fi కాలింగ్ ఫీచర్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 2019 లో ఎయిర్‌టెల్ తన వై-ఫై కాలింగ్ సర్వీసును ఎంపిక చేసిన సర్కిల్‌లలో విడుదల చేసింది. రిలయన్స్ జియో కూడా VoWi-Fi కాలింగ్ ఫీచర్‌ను జనవరి 2020 లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో రెండూ మొత్తం 22 టెలికాం సర్కిల్ లలో VoWi-Fi లేదా వై-ఫై కాలింగ్ సేవలను అందిస్తున్నాయి.

 

వై-ఫై కాలింగ్

మొత్తం టెలికాం సర్కిల్‌లలో ఈ ఫీచర్ ఏదైనా బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ఆధారంగా పనిచేస్తుంది. అయితే ఈ ఫీచర్‌కు మద్దతు ఇస్తున్న హ్యాండ్‌సెట్ల జాబితా చాలా తక్కువగా ఉన్నాయి. ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ మరియు జియో వై-ఫై కాలింగ్‌కు మద్దతు ఇచ్చే ఫోన్‌ల జాబితాను హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ నేడు విడుదల చేసింది.

 

 

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు... రోజువారి 5GB డేటాBSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు... రోజువారి 5GB డేటా

HMD

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సర్వీస్ఇప్పుడు ఏడు నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో లభిస్తుంది. అయితే జియో వై-ఫై కాలింగ్ ఈ రోజు నుండి తొమ్మిది నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించబడుతుంది. ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది మరియు VoWi-Fi ని ప్రారంభించడానికి HMD గ్లోబల్ ఈ ఫోన్‌లకు నెట్‌వర్క్ అప్ డేట్ ను విడుదల చేసింది.

 

 

Tata Sky Binge+ కొత్త ఫీచర్ : 7రోజుల ముందు టీవీషోలను చూడడానికి అనుమతిTata Sky Binge+ కొత్త ఫీచర్ : 7రోజుల ముందు టీవీషోలను చూడడానికి అనుమతి

వై-ఫై కాలింగ్ కు మద్దతు ఇచ్చే నోకియా స్మార్ట్‌ఫోన్‌ల జాబితా
 

వై-ఫై కాలింగ్ కు మద్దతు ఇచ్చే నోకియా స్మార్ట్‌ఫోన్‌ల జాబితా

హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ప్రస్తుతం నోకియా యొక్క తొమ్మిది స్మార్ట్‌ఫోన్‌లకు జియో వై-ఫై కాలింగ్ ఫీచర్‌ను మద్దతు ఇస్తున్నాయి. ఈ ఫీచర్‌ను అందుకున్న వాటిలో నోకియా 9 ప్యూర్‌వ్యూ, నోకియా 8 సిరోకో, నోకియా 8.1, నోకియా 7.2, నోకియా 7.1, నోకియా 7 ప్లస్, నోకియా 6.2, నోకియా 6.1 ప్లస్ మరియు నోకియా 6.1 ఫోన్‌లు ఉన్నాయి.

నోకియా -ఎయిర్‌టెల్ వై-ఫై

నోకియా -ఎయిర్‌టెల్ వై-ఫై

ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్‌ ఫీచర్ విషయానికి వస్తే హెచ్‌ఎండి గ్లోబల్ కేవలం ఏడు స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే మద్దతునిస్తోంది. వాటిలో నోకియా 9 ప్యూర్‌వ్యూ, నోకియా 8 సిరోకో, నోకియా 8.1, నోకియా 7.1, నోకియా 7 ప్లస్, నోకియా 6.1 ప్లస్ మరియు నోకియా 6.1 ఉన్నాయి.

జియో వై-ఫై - నోకియా

జియో వై-ఫై - నోకియా

హెచ్‌ఎండి గ్లోబల్‌ సంస్థ వద్ద నోకియా 4.2, నోకియా 3.2, నోకియా 2.3, నోకియా 2.1, నోకియా 2.2 వంటి ఎంట్రీ లెవల్ ఫోన్లు ఉన్నందున రాబోయే వారాల్లో ఈ జాబితా మరింత పెరుగవచ్చు. వీటిలో ఇంకా వై-ఫై మద్దతు లభించలేదు. ఇప్పటి వరకు 120 కి పైగా స్మార్ట్‌ఫోన్‌లలో ఎయిర్‌టెల్ యొక్క వై-ఫై కాలింగ్ ఫీచర్ ప్రారంభించబడింది. అయితే 200 కి పైగా అనుకూలమైన స్మార్ట్‌ఫోన్‌లలో జియో యొక్క వై-ఫై కాలింగ్ ఫీచర్ మద్దతు లభిస్తున్నట్లు తెలిపింది.

 

 

WhatsApp Payకి ఇండియాలో NPCI గ్రీన్ సిగ్నల్....WhatsApp Payకి ఇండియాలో NPCI గ్రీన్ సిగ్నల్....

VoWi-Fi

VoWi-Fi

VoWi-Fi లేదా వాయిస్ ఓవర్ Wi-Fi మెరుగైన ఇండోర్ వాయిస్ కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఎందుకంటే ఇది మీ యొక్క Wi-Fi నెట్‌వర్క్ ద్వారా ఫోన్ కాల్‌లు చేయడానికి అనుమతిని ఇస్తుంది. ఆపరేటర్లు ఏ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ నుండి అయిన VoWi-Fi సర్వీసును అనుమతిస్తుంది. ఇంతకుముందు ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే జియో తన వై-ఫై కాలింగ్ ఫీచర్‌ను విడుదల చేసిన తర్వాత అది మారిపోయింది.

 

 

ఆపిల్ ఐఫోన్స్ కార్మికుల మీద పడ్డ కరోనావైరస్ ప్రభావంఆపిల్ ఐఫోన్స్ కార్మికుల మీద పడ్డ కరోనావైరస్ ప్రభావం

నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో VoWi-Fi ని ఎలా ప్రారంభించాలి?

నోకియా స్మార్ట్‌ఫోన్‌లలో VoWi-Fi ని ఎలా ప్రారంభించాలి?

నోకియా స్మార్ట్‌ఫోన్‌లు స్టాక్ ఆండ్రాయిడ్‌తో రన్ అవుతున్నందున VoWi-Fi ని ప్రారంభించడం చాలా సులభం.

** మొదటి దశలో భాగంగా ఫోన్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులోని వై-ఫై కాలింగ్ ఎంపిక కోసం చూడండి.

** ప్రత్యామ్నాయంగా మీరు Wi-Fi కాలింగ్‌ను ప్రారంభించడానికి Wi-Fi మరియు నెట్‌వర్క్‌ల ఎంపికకు వెళ్ళవచ్చు.

** VoLTE మరియు Wi-Fi కాలింగ్ ఎంపికల స్విచ్ ఆన్ చేయండి.

** Wi-Fi కాలింగ్ ఆన్ చేసిన తర్వాత భారతదేశంలో ఎక్కడికైనా Wi-Fi ద్వారా కాల్స్ చేయడం కోసం మీకు దగ్గరలో ఉన్న Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వండి.

ఎయిర్‌టెల్ మరియు జియో నెట్‌వర్క్‌లలో చేసిన వై-ఫై కాల్‌లకు అదనపు ఛార్జీలు ఉండవు. Wi-Fi నెట్‌వర్క్ లేనప్పుడు మీ ఫోన్ ఆటొమ్యాటిక్ గా VoLTE కి మారుతుంది.

 

Best Mobiles in India

English summary
Nokia Smartphones Gets Airtel & Jio Wi-Fi Calling Support Features: Here is the List

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X