Home
News

నోకియా T20 టాబ్లెట్ లాంచ్ అయింది!! ధరలు & ఫీచర్స్ ఇవిగో

HMD గ్లోబల్ లైసెన్సీ ఆధారిత నోకియా బ్రాండ్ నేడు ఇండియాలో నోకియా T20 అనే తన మొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను లాంచ్ చేసింది. ఈ Nokia టాబ్లెట్ 2K డిస్‌ప్లేతో వస్తుంది మరియు 8,200mAh బ్యాటరీని కలిగి ఉండి సింగిల్ ఛార్జ్‌పై 15 గంటల వరకు వెబ్ బ్రౌజింగ్ అనుభవాన్ని అందించడానికి రేట్ చేయబడింది. నోకియా T20 స్టీరియో స్పీకర్లు మరియు డ్యూయల్ మైక్రోఫోన్‌లను కూడా కలిగి ఉంది. అదనంగా HMD గ్లోబల్ టాబ్లెట్‌తో మూడు సంవత్సరాల వరకు నెలవారీ సెక్యూరిటీ అప్ డేట్ లను మరియు రెండు సంవత్సరాల ఉచిత ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లను అందజేయనున్నట్లు కూడా హామీ ఇచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నోకియా T20 టాబ్లెట్ ధరలు & లభ్యత వివరాలు

నోకియా T20 టాబ్లెట్ ధరలు & లభ్యత వివరాలు

భారతదేశంలో నోకియా T20 టాబ్లెట్ రెండు కాన్ఫిగరేషన్‌లలో లాంచ్ అయింది. ఇందులో 3GB RAM + 32GB స్టోరేజ్ యొక్క Wi-Fi-ఓన్లీ వేరియంట్ ధర రూ.15,499. కాగా Wi-Fi ఓన్లీ మోడల్‌లో 4GB ర్యామ్ + 32GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ ధర రూ.16,499. అలాగే నోకియా T20 4G మోడల్ యొక్క ధర రూ.18,499. లభ్యత విషయానికి వస్తే ఈ నోకియా T20 టాబ్లెట్ Nokia.com మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ఈరోజు నుండి అమ్మకానికి వస్తుంది. అలాగే రేపటి నుండి Flipkart ద్వారా అందుబాటులో ఉంటుంది. టాబ్లెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు ప్రీలోడెడ్ Spotify యాక్సెస్‌ను పొందుతారు. ఛానెల్‌లలో ప్రధాన బ్రాండ్‌ల ద్వారా వివిధ ఫైనాన్స్ ఆఫర్‌లు కూడా ఉంటాయి.

నోకియా T20 టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

నోకియా T20 టాబ్లెట్ స్పెసిఫికేషన్స్

నోకియా T20 టాబ్లెట్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 11లో నడుస్తుంది మరియు 400 nits గరిష్ట ప్రకాశంతో 10.4-అంగుళాల 2K (2,000x1,200 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. టాబ్లెట్ ఆక్టా-కోర్ Unisoc T610 SoC ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 4GB RAMతో జత చేయబడి ఉంటుంది. ఇది ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ మరియు వెనుక 8-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌తో వస్తుంది. మెరుగైన తక్కువ-కాంతి ఫలితాల కోసం వెనుకవైపు LED ఫ్లాష్ కూడా ఉంది. ఇంకా టాబ్లెట్‌లో OZO ప్లేబ్యాక్ మరియు స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ కోసం మీరు డ్యూయల్ మైక్రోఫోన్‌లను కూడా పొందుతారు.

స్టోరేజ్

కంటెంట్ స్టోరేజ్ పరంగా నోకియా T20 32GB మరియు 64GB స్టోరేజ్ ఎంపికలను కలిగి ఉంది. స్టోరేజీని 512GB వరకు విస్తరించుకోవడానికి మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE (ఐచ్ఛికం), Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. టాబ్లెట్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 8,200mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Nokia T20 Tablet Released in India With 8,200mAh Battery and Stereo Speakers: Price, Specs, Sale Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X