Home
News

Nokia T21 టాబ్లెట్‌ ఇండియా లో లాంచ్ అయింది! ధర,స్పెసిఫికేషన్లు

By Maheswara

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఎవర్‌గ్రీన్ మొబైల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన నోకియా తాజాగా నోకియా T21 టాబ్లెట్‌ను ప్రపంచ మార్కెట్‌ లో ఇదివరకే పరిచయం చేసింది. ఇప్పుడు నోకియా కంపెనీ అధికారికంగా నోకియా T21 టాబ్లెట్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 8000mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీ బ్యాకప్ ఉండటం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం.

నోకియా కంపెనీ

అవును, నోకియా కంపెనీ భారతదేశంలో కొత్త Nokia T21 టాబ్లెట్ పరికరాన్ని విడుదల చేసింది. ఈ ట్యాబ్ 4GB RAM + 64GB వేరియంట్‌లో అందుబాటులో ఉంది మరియు Android 12 OSలో రన్ అవుతుంది. దీనితో పాటు, రాబోయే రెండు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లను అందుకునే అవకాశం కూడా ఉంది. ఇది OZO ఆడియో మద్దతును కలిగి ఉంది మరియు HD నాణ్యత వీడియోను ప్లే చేస్తుంది. ఈ ఫోన్ యొక్క ఇతర స్పెసిఫికేషన్ల గురించి మరింత వివరంగా  తెలుసుకుందాం.

Nokia T21 టాబ్లెట్‌ డిస్‌ప్లే డిజైన్ వివరాలు

Nokia T21 టాబ్లెట్‌ డిస్‌ప్లే డిజైన్ వివరాలు

నోకియా T21 ట్యాబ్‌లో 10.36-అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్ప్లే 2000 x 1200 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది 400 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే యాస్పెక్ట్ రేషియో 5:3 మరియు SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ పొందింది.

ప్రాసెసర్ వివరాలు ఏమిటి?

ప్రాసెసర్ వివరాలు ఏమిటి?

Nokia T21 టాబ్లెట్‌ Unisoc T612 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది, Mali-G57 GPU మద్దతుతో పూర్తి చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో పని చేస్తుంది. ఇది 4GB RAM మరియు 64GB లేదా 128GB నిల్వ ఎంపికలలో కూడా వస్తుంది. ఇది కాకుండా, దీనిలో  మెమరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.

ఈ టాబ్లెట్‌ యొక్క కెమెరా సెటప్ వివరాలు

ఈ టాబ్లెట్‌ యొక్క కెమెరా సెటప్ వివరాలు

Nokia T21 Tab ఆటో ఫోకస్ లెన్స్ సామర్థ్యం గల 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఒకే వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది LED ఫ్లాష్‌ని సపోర్ట్ చేస్తుంది. ఈ టాబ్లెట్‌ లో వీడియో కాలింగ్ మరియు సెల్ఫీలు తీసుకోవడానికి 8-మెగాపిక్సెల్ సెన్సార్ సామర్థ్యం గల సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

ఈ టాబ్లెట్‌ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎంత? ఇతర ఫీచర్లు ఏమిటి?

ఈ టాబ్లెట్‌ యొక్క బ్యాటరీ బ్యాకప్ ఎంత? ఇతర ఫీచర్లు ఏమిటి?

నోకియా T21 ట్యాబ్ 8,200mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్‌ని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్‌ పూర్తి ఛార్జ్‌పై 3 రోజుల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది. దీని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.0, వైఫై, హెడ్‌ఫోన్ జాక్, GPS, USB టైప్-సి, సపోర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

Nokia T21 టాబ్లెట్‌ ధర మరియు సేల్ వివరాలు

Nokia T21 టాబ్లెట్‌ ధర మరియు సేల్ వివరాలు

Nokia T21 Tab భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ టాబ్లెట్‌ యొక్క Wi-Fi వేరియంట్ ధర రూ.17,999. అలాగే, LTE + Wi-Fi వేరియంట్ ధర రూ. 18,999 గా ఉంది. ఈ పరికరం చార్‌కోల్ గ్రే కలర్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. ఈ టాబ్లెట్‌తో ప్రారంభ ఆఫర్‌గా ఫ్లిప్ కవర్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అలాగే అడ్వాన్స్ బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలుస్తోంది, ముందుగా బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ.1,000 వరకు తగ్గింపు కూడా లభించనుంది.4GB RAM మరియు 64GB లేదా 128GB నిల్వ ఎంపికలలో కూడా వస్తుంది. ఇది కాకుండా, దీనిలో  మెమరీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia T21 Android Tablet With 8000mAh Battery Launched In India. Full Specifications Details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X