భారత్‌లో నోకియా 5జీ ట్రెయిల్..?

Written By:

తమ 5జీ నెట్‌వర్క్ సేవలను భారత్‌లో పరీక్షించేందుకు స్థానిక టెలికామ్ ఆపరేటర్లతో నోకియా సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌లో ప్రస్తుత ఇంటర్నెట్ సామర్థ్ర్యాలను పరిశీలించినట్లయితే 4జీ నెట్‌వర్క్ పూర్తి స్థాయిలో విస్తరించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి మౌళిక సదుపాయాలు కూడా ఇప్పుడిప్పుడే ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో 4జీ సేవలే సక్రమంగా అందుబాటులో లేకుండా 5జీ సేవలా అంటూ పలువురు నోరెళ్లబెడతున్నారు.

భారత్‌లో నోకియా 5జీ ట్రెయిల్..?

నోకియా ఇప్పటికే తన 5జీ సేవలను గ్లోబల్ టెలికాం దిగ్గాజలైన వెరిజాన్ (యూఎస్), ఎస్‌కే టెలికామ్ (కొరియా), ఎన్‌టీటీ డొకోమో (జపాన్) వద్ద విజయవంతంగా పరీక్షించి చూసింది. నోకియా అందించే 5జీ టెక్నాలజీ సెకను 100 megabitల వేగంతో కూడినా ఇంటర్నెట్‌ను చేరువ చేయగలదట. కమర్షియల్ మార్కెట్లోకి నోకియా 5జీ సేవలు 2020 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఎందుకంత బెస్ట్ అంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

త్వరలో అందుబాటులోకి రానున్న 5జీ, మునుపెన్నడు ఆస్వాదించని సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను చేరువ చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

5జీ ఎంత స్పీడ్‌లో లభ్యమవుతుంది..?, ఎంత డేటాను ఖర్చు చేస్తుంది..? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి స్పష్టమైన జవాబులు లేవు.

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు 5జీ నెట్‌వర్క్ దోహదం కానుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై 5జీ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. త్వరలో రాబోయే 5జీ నెట్‌వర్క్ 3జీ, 4జీలతో పోలిస్తే ఖరీదైన నెట్‌వర్క్‌‌గా అవతరించనుంది.

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం అంత సలువైన విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఖరీదైన టెక్నాలజీకి సంబంధించి పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలను కల్పించేందుకు లక్షల కోట్ల పెట్టుబడలతో పాటు ప్రభుత్వ సహకారంతో కూడిన పాలసీలు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

రానున్న ఐదు సంవత్సరాల్లో 5జీ టెక్నాలజీ పై కృషి చేసేందుకు దిగ్గజ టెలికామ్ ఆపరేటర్స్ అయిన చైనా మొబైల్, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, సాఫ్ట్ బ్యాంక్‌లు సంయుక్తంగా GTI 2.0 పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసాయి.

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

5జీ నెట్‌వర్క్ గురించి ఇప్పటికి వరకు ఏ విధమైన అధికారిక డెఫినిషన్ వెలుగులోకి రాలేదు. అయితే, 5జీ అనేది 4జీ నెట్‌వర్క్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా వస్తోన్న వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అని ధృడంగా చెప్పొచ్చు.

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో 4జీ ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఇవల్యూషన్) అనేది బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్. ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 100 Mbit/sగాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 4జీ టెక్నాలజీలో ఎల్టీఈ-ఏ అనేది అడ్వాన్సుడ్ వర్షన్‌గా ఉంది. ఈ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 500 Mbit/s గాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది.

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

2020లో రాబోతోన్న 5జీ టెక్నాలజీ డేటా స్పీడ్‌కు సంబంధించి ఏ విధమైన వివరాలు వెల్లడికాలేదు.

5జీ ఇంటర్నెట్ గురంచి పలు ఆసక్తికర విషయాలు...

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువావీ 2020 నాటికి 5జీ నెట్‌వర్క్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది. మరో సంస్థ ఎన్‌ఐటి డొకోమో ఇంక్‌, టోక్యోలోని రొపోంగి హిల్స్‌ కాంప్లెక్సుల్లో తాము 2015 అక్టోబర్‌ 13న అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్‌ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్‌ వేగాన్ని అందుకుందని చెబుతోంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ 1000 రెట్లు వేగంగా పనిచేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia in talks with Indian telcos to start trials of 5G networks. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot