నోకియా ఇండియాకు లీగల్ చిక్కు?

Posted By: Prashanth

నోకియా ఇండియాకు లీగల్ చిక్కు?

 

నోకియా ఇండియా తాజాగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొవల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఢిల్లీకి చెందిన రోహన్ అరోరా జూలై 2007లో నోకియా ఈ కమ్యూనికేటర్‌ను రూ.37,000లు వెచ్చించి నోకియా రిటైలర్ అయిన లూత్రా కమ్యూనికేషన్స్ ద్వారా కొనుగోలు చేశారు. అయితే ఆ ఫోన్‌లో సాంకేతికపరమైన సమస్యలు తెలెత్తటంతో సెప్టంబర్ 2007 సెప్టంబర్‌లో మరమ్మతు నిమిత్తం సంబంధిత సర్వీస్ సెంటర్‌ను ఆశ్రయించారు. అయితే అరోరా ఫోన్ కొనుగోలు చేసిన లుత్రా కమ్యూనికేషన్స్ అదేవిధంగా నోకియా ఇండియాల నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. ఫోన్ కూడా తిరిగి ఇవ్వలేదు. దింతో విస్తు చెందిన సదురు వినియోగదారుల సౌత్-2 డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రీడ్రెస్సల్ ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన బెంచ్ వాదోపవాదనలు పరిశీలించిన అనంతరం సదరు సంస్థ పనితీరును ఎండగడుతూ వినియోగదారుకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. తాజా తీర్పులో భాగంగా నోకియా ఇండియా రోహన్ అరోరా కు ఫోన్ ధర రూ.37,000తో పాటు, నాసిరకం ఉత్పత్తిని విక్రయించినందుకుగాను రూ.25,000, ఇతర ప్రొసీడింగ్స్ కింద రూ.5,000లు చెల్లించాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot