పాపం.. పదివేల ఉద్యోగాలు కట్!

Posted By: Staff

పాపం.. పదివేల ఉద్యోగాలు కట్!

 

‘మొబైల్ ఫోన్‌ల నిర్మాణంలో విశ్శసనీయ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నోకియా ప్రస్తుతం గడ్డుపరిస్ధితులను ఎదుర్కొంటుంది. ప్రత్యర్థి బ్రాండ్‌లైన సామ్‌సంగ్, ఆపిల్‌లు లాభాల బాటలో దూసుకువెళుతుంటే నోకియా వరస నష్టాలను నమోదు చేస్తుంది’

ఫిన్లాండ్‌కు చెందిన ప్రఖ్యాత మొబైల్ ఫోన్ ల తయారి దిగ్గజం నోకియా.. 2013 చివరికల్లా ప్రపంచవ్యాప్తంగా తనకున్న సిబ్బందిలోని 10 వేల మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా కొన్ని ఉత్పత్తి యూనిట్లను కూడా మూసివేసే ఆలోచనలో ఉంది. ఈ ఏడాది మార్చి చివరినాటికి నోకియాలో 1,22,148 మంది పని చేస్తున్నారు. ఇందులో 68,595 మంది నోకియా సీమెన్స్ నెట్‌వర్క్‌లో ఉద్యోగులుగా ఉన్నారు.

పెట్టుబడుల ప్రాధాన్యతలను సమతుల్యం చేయడంతోపాటు ఉత్పత్తులు, సర్వీసుల్లో అదనపు తగ్గింపులు చేపడుతున్నామని నోకియా చెబుతోంది. ఇందులో భాగంగానే పరిశోధనా, అభివృద్ధి ప్రాజెక్టుల్లో కోతలు విధిస్తున్నామని, ఫలితంగా జర్మనీలోని ఉల్మ్, కెనడాలోని బర్న్‌బేలోని యూనిట్లను మూసివేసే పరిస్థితి నెలకొననుందని అంటోంది. ఫిన్లాండ్‌లోని సలో ప్లాంట్‌ను కూడా కంపెనీ మూసివేయనుంది. అయితే ఇక్కడి పరిశోధనా, అభివృద్ధి కేంద్రం కార్యకలాపాలు మాత్రం కొనసాగుతాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot