'నోకియా' పూర్వ వైభవానికి కొత్త జిమ్మిక్కు... !

Posted By: Prashanth

'నోకియా' పూర్వ వైభవానికి కొత్త జిమ్మిక్కు... !

 

నోకియా ప్రపంచ జనాభా మనసు దోచిన మొబైల్ కంపెనీ. అలాంటి నోకియా ఇటీవల మార్కెట్లో వేరే ఇతర మొబైల్ తయారీదారుల నుండి గట్టి పోటీని ఎదుర్కోంటుంది. ఇలాంటి వాటన్నింటిని తట్టుకోని నిలబడేందుకు గాను నోకియా మార్కెట్లోకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి తక్కువ ఖరీదు కలిగిన స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని నోకియా అతి సన్నిహిత కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ప్రపంచ జనాభాలో 50శాతం మంది తక్కువ ఖరీదు కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ని కొనేందుకు ఇష్టపడతారని ఇటీవల ఓ ప్రముఖ రీసెర్చీ సంస్ద వెల్లడించింది. ఈ సందర్బంలో నోకియా ఈ నిర్ణయం తీసుకోవడం.. ప్రపంచ మొబైల్ మార్కెట్లో ఎక్కువ షేర్‌ని సొంతం చేసుకునేందుకు గాను మైక్రోసాప్ట్, నోకియా కలిసే ఈ నిర్ణయానికి వచ్చాయని నిపుణుల అభిప్రాయం.

నోకియా లుమియా 610 మొబైల్‌తో పాటుగా... హై ఎండ్ విభాగానికి చెందిన గ్లోబల్ వర్సన్ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయనున్నట్లు సమాచారం. నోకియా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన నోకియా లుమియా 900 మొబైల్‌ని అమెరికాలో ఏటి అండ్ టి వారు అందిస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు ఫిబ్రవరి 27న బార్సిలోనాలో జరగనున్న ట్రేడ్ షో న్యూస్ కాన్పరెన్స్‌లో నోకియా కొత్త మొబైల్స్‌కి చెందిన కబుర్లను తెలుపనుంది.

స్మార్ట్ ఫోన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గాను నోకియా.. మైక్రోసాప్ట్‌తో చేతులు కలిపి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌ని మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot