Home
News

ఆపిల్,శాంసంగ్ ప్రీమియం ఫోన్లకు పోటీగా నోకియా కొత్త ఫోన్లు! ధర తక్కువే

By Maheswara

గత కొన్ని సంవత్సరాల నుంచి నోకియా నుంచి వచ్చిన కొన్ని మోడళ్లను మినహాయించి, కొత్త నోకియా స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ప్రతిసారీ, డై-హార్డ్ నోకియా అభిమానులు నిరాశ చెందారు. సామ్‌సంగ్, వన్‌ప్లస్ లాంటి ఫోన్లకు పోటీగా మంచి మోడల్‌ను ప్రవేశపెడుతుందా అని చాలా మంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. వారి కోరిక ఇప్పుడు ఫలించబోతోంది.

అవును, ఆపిల్, శాంసంగ్ మరియు వన్ ప్లస్ వంటి వంటి ఫ్లాగ్ షిప్ ఫోన్లకు పోటీగా నోకియా లాంచ్ చేయబోతున్న నోకియా C99 స్మార్ట్‌ఫోన్ గురించి మాట్లాడుతున్నాము. నోకియా ఈ స్మార్ట్‌ఫోన్‌ను "మ్యాజిక్ మ్యాక్స్" అని పిలుస్తోంది. మ్యాజిక్ మ్యాక్స్ పేరు వెనుక ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ, ఇది కొన్ని అద్భుతమైన ఫీచర్లను ప్యాక్ చేసినందున దీనికి ఈ పేరు వచ్చింది అని భావించవచ్చు.

Nokia To Launch Nokia C99 Flagship Level Smartphone In India. Expected Price And Specifications

బార్సిలోనాలో జరిగిన MWC 2023 ఈవెంట్‌లో నోకియా తన రాబోయే రెండు స్మార్ట్‌ఫోన్‌లను నోకియా మ్యాజిక్ మ్యాక్స్ మరియు నోకియా C99 ని లాంచ్ చేసింది. అప్పటి నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లు కొన్ని లీక్‌లు మరియు పుకార్లలో భాగమయ్యాయి. ఈ ఫోన్ల యొక్క స్పెసిఫికేషన్ ల వివరాల నుండి లాంచ్ డేట్, ధరల వివరాల వరకు అన్నీ అంచనాల వివరాలను మనం ఇక్కడ చూద్దాం.

నోకియా మ్యాజిక్ మ్యాక్స్ యొక్క లాంచ్ తేదీ ఇప్పటికీ ప్రకటించలేదు, అయితే ఇది మరి కొన్ని వారాల్లో లాంచ్ కావచ్చని అంచనా వేయబడింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర సుమారు $550గా అంచనా వేయబడింది. ఇక నోకియా C99 ఫోన్ గురించి వివరాలు గమనిస్తే, ఇది MWC 2023లో లాంచ్ చేసారు కాబట్టి ఈ ఫోన్ లాంచ్ కోసం వేచి ఉండాల్సి ఉంటుంది.

Nokia To Launch Nokia C99 Flagship Level Smartphone In India. Expected Price And Specifications

బహుశా 2023 చివరిలో, మనము నోకియా C99 లాంచ్‌ను చూడవచ్చు మరియు దీని ధర సుమారు $480 ఉంటుందని అంచనా వేయబడింది.నోకియా C99 లాంచ్ ఇంకా చాలా దూరంలో ఉంది కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు వెల్లడించలేదు. ట్విట్టర్ ద్వారా లీక్ అయిన సమాచారం ప్రకారం, నోకియా C99 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ధర రూ.45,000 ఉంటుంది అని అంచనా.

ఇక, నోకియా C99 స్మార్ట్‌ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ల వివరాలను గమనిస్తే, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం. నోకియా C99 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్కమ్ యొక్క తాజా హై ఎండ్ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 180W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో ఫీచర్లు కలిగి ఉంటుంది.

ఇంకా, నోకియా C99 స్మార్ట్‌ఫోన్‌లోని సరికొత్త స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను గరిష్టంగా 16GB RAMతో జత చేయవచ్చు. అలాగే, దాని 6.7-అంగుళాల డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 7 రక్షణకు మద్దతుతో రావచ్చు. దీని 144MP ప్రధాన కెమెరాను 64MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 48MP టెలిఫోటో కెమెరాతో జత చేయవచ్చు అని అంచనాలు తెలియచేస్తున్నాయి. ఇక ఈ ఫోన్లు ఇండియా లో ఎప్పుడు లాంచ్ అవుతాయని ఖచ్చితమైన సమాచారం లేదు. త్వరలోనే లాంచ్ అవ్వాలని ఆశిద్దాం.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia To Launch Nokia C99 Flagship Level Smartphone In India. Expected Price And Specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X