నోకియా గుట్టు విప్పేనా?

By Prashanth
|
Nokia


అత్యుత్తమ మొబైల్ బ్రాండ్ గా గ్యాడ్జెట్ ప్రియులు అభిమానాన్ని చొరగున్న సంస్థ ‘నోకియా’.మన్నికే లక్ష్యంగా ఈ బ్రాండ్ రూపొందించే మొబైల్ ఫోన్ లు డిజైనింగ్ అదేవిధంగా పనితీరు విషయంలఓ ఏమాత్రం రాజీపడవు. తాజాగా, నోకియా ప్రవేశపెట్టబోతున్న విండోస్ ఫోన్ 8 హ్యాండ్ సెట్ ల పై ఉత్కంఠ వాతావరణం నెలకుంది. వీటి వివరాలను నోకియా సెప్టంబర్ 5న నిర్వహించే ‘సాంవత్సరిక నోకియా వరల్డ్ ఈవెంట్’లో ప్రకటించే అవకాశం ఉంది.

నోకియా ఆషా305:

నమ్మకమైన బ్రాండ్ నోకియా గత జూన్‌లో మూడు ఆషా టచ్ సిరీస్ ఫోన్‌లను ప్రకటించింది. వాటిలో మొదటిదైన ‘ఆషా305’ను నోకియా తాజాగా ఆవిష్కరించింది. వినోదాత్మక అంశాలతో నిండి ఉన్న డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్‌లో 40 ప్రీలోడెడ్ గేమ్‌లతో పాటు మీడియా ఫైళ్లను స్టోర్ చేసుకునేందుకు 32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ సపోర్ట్‌ను కల్పించారు.

ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

3 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 240 x 400పిక్సల్స్,

2మెగాపిక్సల్ రేర్ కెమెరా,

10ఎంబీ ఇన్-బుల్ట్ మెమెరీ,

మైక్రో ఎస్‌డి కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్‌టైమ్ 14గంటలు, స్టాండ్‌బై టైమ్ 528గంటలు),

విండోస్ లైవ్ మెసెంజర్, యాహూ మెసెంజర్, గుగూల్ టాక్.

నోకియా ఆన్‌లైన్ షాప్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌కు రూ.4,668 చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X