నోకియా T20 టాబ్లెట్ ధరలు, ఫీచర్స్ లీక్ అయ్యాయి!! వివరాలు ఇవే...
ప్రముఖ HMD గ్లోబల్ సంస్థ 2014 లో టాబ్లెట్ తయారీకి లైసెన్స్‌ను పొందిన తరువాత తన బ్రాండ్ నుండి మొదటి టాబ్లెట్‌ను విడుదల చేయనున్నది. నోకియా T20 టాబ్లెట్ పేరుతో రాబోతున్న మొదటి టాబ్లెట్ యొక్క ధర మరియు ఫీచర్స్ వివరాలు లాంచ్ అవ్వడానికి ముందే లీక్ అయ్యాయి. నోకియా T20 టాబ్లెట్ యుకె రిటైలర్ వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. దీని యొక్క వివరాల ప్రకారం ఇది వై-ఫై మరియు వై-ఫై + 4G వేరియంట్‌లలో వస్తుందని భావిస్తున్నారు.

ఈ లీక్ రాబోయే టాబ్లెట్ యొక్క UK ధరలు మరియు దాని ముఖ్యమైన ఫీచర్ వివరాలను చూపిస్తుంది. అదనంగా TA-1392 మరియు TA-1397 మోడల్ నెంబర్లతో రెండు నోకియా టాబ్లెట్లను రష్యన్ ధృవీకరణ వెబ్‌సైట్లలో గుర్తించబడ్డాయి. ఈ మోడల్ నంబర్లు త్వరలో విడుదల కానున్న నోకియా T20లో ఉన్నట్లు ఉహించబడింది.

నోకియా T20 టాబ్లెట్ లీక్ ధరల వివరాలు
నోకియా T20 టాబ్లెట్ UK రిటైలర్ వెబ్‌సైట్ మోర్ కంప్యూటర్స్‌లోని జాబితా ప్రకారం ఇది ఓన్లీ వై-ఫై మరియు వై-ఫై + 4G కనెక్టివిటీ వేరియంట్లలో జాబితా చేయబడింది. ఈ జాబితాలను మొదట నోకియామోబ్ గుర్తించారు. ఈ టాబ్లెట్ యొక్క ఓన్లీ వై-ఫై వేరియంట్ ధర GBP185 (సుమారు రూ.19,100) ధరతో జాబితా చేయగా, వై-ఫై + 4G వేరియంట్ UK లో GBP 202 (సుమారు రూ.20,900) ధర వద్ద జాబితా చేసినట్లు చెబుతున్నారు.

నోకియా T20 టాబ్లెట్ లీక్ స్పెసిఫికేషన్స్
నోకియా బ్రాండ్ నుంచి రాబోయే సరికొత్త టాబ్లెట్ T20 స్పోర్ట్స్ 10.36-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 4GB ర్యామ్, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు. వెబ్‌సైట్‌లోని జాబితా కూడా టాబ్లెట్‌ను బ్లూ కలర్ ఆప్షన్‌లో అందిస్తుందని సూచిస్తుంది. HMD గ్లోబల్ మరియు నోకియా ఇప్పటివరకు ఈ టాబ్లెట్‌లకు సంబందించిన సమాచారంను ఏమీ కూడా షేర్ చేయలేదు.

అదనంగా, మోడల్ నెంబర్ లు TA-1392 మరియు TA-1397 కలిగిన రెండు నోకియా టాబ్లెట్లను గత నెలలో రష్యన్ ధృవీకరణ వెబ్‌సైట్‌లో గుర్తించారు. ధృవపత్రాలను మొదట నోకియామోబ్ నివేదించారు. ఈ టాబ్లెట్‌లు త్వరలో విడుదల కానున్న నోకియా టి 20 టాబ్లెట్ యొక్క వేరియంట్‌లని ఉహించారు. నోకియా S1 మరియు నోకియా లూమియా 2520 టాబ్లెట్లను వరుసగా 2014 మరియు 2013 లో లాంచ్ చేసిన తరువాత ఇది మూడవ టాబ్లెట్ అవుతుంది.


Click it and Unblock the Notifications








