ఫోటో లీక్.. చైనా వెబ్‌సైట్ పనే?

Posted By: Super

ఫోటో లీక్.. చైనా వెబ్‌సైట్ పనే?

త్వరలో విడుదల కాబోతున్నవిండోస్ ఫోన్8 లూమియా స్మార్ట్‌ఫోన్ పై మార్కెట్ వర్గాల్లో వాడివేడి చర్చ సాగుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించి నోకియా, సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాల కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు క్రిస్‌వెబర్ పోటీని ఎదుర్కొవల్సిందిగా

సామ్‌సంగ్‌కు సవాల్ విసురుతూ ఓ సందేశాన్ని తన ట్వీటర్ ద్వారా పోస్ట్ చేశారు. సెప్టంబర్ 5న విడుదల కానున్న అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్ ‘నోకియా విండోస్ ఫోన్ 8’కు సంబంధించి చైనా టెక్నాలజీ సైట్ Cnbeta బహిర్గతం చేసిన ఆసక్తికర సమాచారం చర్చనీయాంశంగా మారింది.

ఈ టెక్నాలజీ న్యూస్ పోర్టల్, అనధికారికి విండోస్ ఫోన్ 8 చిత్రాలను పోస్ట్ చేసింది. హ్యాండ్‌సెట్ ముందుభాగాన్ని సూచిస్తున్న ఈ ఫోటోలు ఫోన్ స్ర్కీన్ పరిమాణాన్ని 4.3 అంగుళాలుగా చూపుతున్నాయి. ఈ స్ర్కీన్ సైజ్ ఇంచుమించుగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2, నోకియా లూమియా 900లకు దగ్గరగా ఉంటుంది. Cnbeta పోస్ట్ చేసిన హ్యాండ్‌సెట్ పై విండోస్ ఫోన్ 8 లోగోతో పాటు లైట్ సెన్సార్ ఏర్పాటుకు సంబంధించిన రంధ్రాన్ని గమనించవచ్చు.

అనధికార వర్గాల సమాచారం మేరకు ‘నోకియా పై’ (Nokia Phi)గా అభివర్ణించబడుతున్న సరికొత్త నోకియా విండోస్ ఫోన్ 8 ఫీచర్లు (నమూనా):

4.65 అంగుళాల డిస్‌ప్లే,

ఎక్సటర్నల్ ఎస్డీ‌కార్డ్ స్లాట్,

ఎన్ఎఫ్‌సీ,

4జీ ఎల్‌టీఈ నెట్‌వర్క్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot