Home
News

నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ డిజైన్ లీక్! ధర, స్పెసిఫికేషన్లు

By Maheswara

ప్రస్తుతం ట్రెండ్ కి తగినట్లు గా, నేటికీ మొబైల్ మార్కెట్‌లో పాపులర్ బ్రాండ్ అయిన నోకియా వివిధ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లను పరిచయం చేసింది. ఇటీవలే నోకియా XR 20 ఫోన్ లాంచ్ చేయబడిన సంగతి తెలిసిందే. మరియు ఇది మార్కెట్లో చాలా అంచనాలను పెంచేసింది. మరియు ఇప్పుడు దానికి సీక్వెల్‌గా నోకియా XR 21 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

అవును, నోకియా కంపెనీ కొత్త Nokia XR21 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరియు దానిలోని కొన్ని ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ యొక్క ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్స్ మరియు ఇది 4800mAh బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

Nokia XR21 With Snapdragon 695 Soc Design Leaked, Expected Specifications And Other Details In Telugu.

అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌తో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ఉంటుందని చెప్పబడింది. ఇది దుమ్ము మరియు నీటి నుండి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంకా, నోకియా XR21 స్మార్ట్‌ఫోన్‌లో ఏ ఇతర ఫీచర్లు ఉంటాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.

నోకియా XR21 డిస్ప్లే డిజైన్ వివరాలు: నోకియా XR21 స్మార్ట్‌ఫోన్ 6.49-అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లేను 1,080 x 2,400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో కలిగి ఉంది. దీని డిస్ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.

నోకియా XR21 యొక్క ప్రాసెసర్ వివరాలు: నోకియా XR21 స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 OS సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజీ ని కూడా కలిగి ఉంటుంది.

నోకియా XR21 కెమెరా సెన్సార్ వివరాలు: నోకియా XR21 స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరాలో 64 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది. రెండవ కెమెరా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో, సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ సెన్సార్ సామర్థ్యంతో వస్తుంది.

నోకియా XR21 బ్యాటరీ మరియు ఇతర ఫీచర్ల వివరాలు: నోకియా XR21 స్మార్ట్‌ఫోన్ 4800 mAh బ్యాటరీతో శక్తిని పొందుతుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.1, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫోన్‌లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. భారతదేశంలో నోకియా XR21 స్మార్ట్‌ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది.

నోకియా XR21 అంచనా ధర: నోకియా XR21 ఫోన్ 6GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో దాదాపు రూ. 20,000 లలో ఉంటుందని అంచనా.

More from GizBot

Best Mobiles in India

English summary
Nokia XR21 With Snapdragon 695 Soc Design Leaked, Expected Specifications And Other Details In Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X