ఆసక్తి రేపుతున్న కిమ్ జాంగ్ ఫోన్, తొలిసారి చూసిన వీడియో అదే !

అతనో డిక్టేటర్..అగ్రదేశాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్న నేత.. మా జోలికి వస్తే మిమ్మల్ని బూడిదలో కలిపేస్తామంటూ హెచ్చరిస్తున్న నేత..

|

అతనో డిక్టేటర్..అగ్రదేశాన్ని తొడగొట్టి సవాల్ చేస్తున్న నేత.. మా జోలికి వస్తే మిమ్మల్ని బూడిదలో కలిపేస్తామంటూ హెచ్చరిస్తున్న నేత..ఐక్యరాజ్యసమితి ఎన్ని ఆంక్షలు విధించినా వాటిని లెక్కచేయక హైడ్రోజన్ బాంబు పరీక్ష..అలాగే న్యూక్లియర్ టెస్ట్ లు జరుపుతూ ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్నాడు. అతనెవరో ఈపాటికి మీకు తెలిసే ఉంటుంది. అతనే నార్త్ కొరియా అద్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. అంతలా ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న నేత ఏ ఫోన్ వాడుతున్నారు. దీనిపై మీడియా పదే పదే దృష్టి పెట్టింది.. ఆ వివరాలు మీకోసం.

Read more: అమెరికాను ఒక్క బటన్‌తో బూడిద చేసి పారేస్తాం

1

1

న్యూక్లియర్ టెస్ట్ సంధర్భంగా నేషనల్ సెక్యూరిటీ అధికారులతో కిమ్ జాంగ్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలో అందరికళ్లు ఆ మీటింగ్ మీద లేవు. కిమ్ జాంగ్ టేబుల్ మీద ఉన్న ఫోన్ మీదనే పడ్డాయి. అన్ని మీడియా సంస్థలు ఆ పోణ్ గురించే ప్రముఖంగా కవరేజ్ చేశాయి.

2

2

అప్పట్లో అది ఓ సంచలనం. ఎందుకంటే నార్త్ కొరియా 2008 నుంచి ఫోన్ల వాడకాన్ని తమ దేశంలోకి ప్రవేశపెట్టింది. అందుకే అంతగా దానిపై మీడియా దృష్టిపెట్టింది. అది కిమ్ జాంగ్ టేబుల్ మీద ఉన్న వెంటనే దాన్ని నార్త్ కొరియా అధ్యక్షుడు తన చేతిలోకి తీసుకున్నాడు.

3

3

ఓ చేత్తో సిగిరెట్ మరో చేత్తో ఫోన్...ఇంతకీ ఆ ఫోన్ ఏ కంపెనీది. అనేదానిపై పెద్ద చర్చనే నడిచింది. ఈ చర్చలో మూడు కంపెనీలు ప్రస్తావనకు వచ్చాయి. ఒకటి శాంసంగ్ రెండు ఆపిల్ మూడు హెచ్ టీసీ

4

4

కొరియన్ కంపెనీ శాంసంగ్ ప్రపంచంలోనే టాప్ కంపెనీగా దూసుకుపోతుంది. అప్పటికే గెలాక్సీ మోడల్స్ వచ్చాయి. మరి అది శాం సంగ్ ఫోన్ అయ్యుంటుందా అంటే కంపెనీ అది మా ఫోన్ కాదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. శాం సంగ్ చర్చ నుంచి పక్కకు వెళ్లింది.

5

5

ఇక ఆపిల్ వంతు..ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫోన్..ఒబామా సైతం దీన్ని ఉపయోగిస్తారు..అయితే ఇది కూడా చర్చ నుంచి బయటకు వెళ్లింది. ఆపిల్ ఫోన్ కాదని తేలిపోయింది.

6

6

ఇక మిగిలింది తైవాన్ కు చెందిన హెచ్ టీసీ...ఈ కంపెనీ ఫోన్‌నే కిమ్ జాంగ్ వినియోగిస్తున్నారని తేలింది. దీంతో కంపెనీ ఒక్కసారిగి ఆనందంలో మునిగితేలింది. కిమ్ జాంగ్ మా ఫోన్ వాడటం కంపెనీకి చాలా గర్వంగా ఉందంటూ ఓ ప్రకటనలో తెలిపింది.

7

7

రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న నేతలు తమ ఫోన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఏ సమాచారం ఇతరులకు చేరకుండా ఉండేందుకు సెక్యూరిటీ ఫోన్లు వాడుతారు. అయితే కిమ్ జాంగ్ మాత్రం దీనికి ఢిపరెంట్ గా వ్యవహరించారు. దీంట్లో కూడా మతలబు ఉంది.

8

8

ఆపిల్ ఫోన్ వాడకపోవటానికి కారణం అది యుఎస్ నుంచి తయారైంది. ఇక శాంసంగ్ కూడా దక్షిణ కొరియాకు చెందినది. ఆ దేశంపై పగతో రగిలిపోతున్నాడు. అలాంటి సమయంలో కిమ్ జాంగ్ ఈ ఫోన్ల మీద ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.

9

9

ఇక తైవాన్ ఫోన్ హెచ్ టీసీ చైనాకు చెందినది. చైనాతో కిమ్ జాంగ్ కు చాలానే మిత్రుత్వం ఉంది. ఇద్దరు ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి హెచ్ టీసీ ఫోన్ వైపే ఎక్కువ మగ్గు చూపారని తెలుస్తోంది.

10

10

ఇక ఫోన్ లో ఇంటర్నెట్ యాక్సెస్ కాగానే కిమ్ జాంగ్ చూసిన వీడియో యుఎస్ మీద కొరియా అటాక్ చేసి దాన్ని బూడిద చేసిందంటూ ఓ వ్యక్తి కలకంటున్నది. పగతో రగిలిపోయే వారికి అదే పెద్ద గెలుపంటూ దాన్ని చూసి తన్మయం చెందారు కిమ్ జాంగ్.

11

11

నార్త్ కొరియా ఐటీ పరంగా ఇంకా ప్రారంభదశలోనే ఉంది. అక్కడ చాలామందికి మొబైల్ అంటనే తెలియదు. 2008లో మొబైల్స్ ప్రవేశపెట్టారు. అయితే ఎక్కువ మంది కేవలం నెట్ లేని ఫోన్లు వినియోగిస్తారు. నెట్ కూడా పరిమిత స్థాయిలో ఉంటుంది.

12

12

ఈజిప్ట్ కంపెనీ ఓరాస్ కోమ్ తో నార్త్ కొరియా టెలికాం ఒప్పందం కుదర్చుకుంది. అది ఇంటర్నెట్ కి సంబంధించిన సేవలను అందిస్తోంది. అయితే అక్కడ ప్రముఖులు మాత్రమే ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తారు. మిగతా వారంతా నార్మల్ ఫోన్లనే వినియోగిస్తారని సియోల్ మీడియా తెలిపింది.

13

13

అయితే ఎంత శత్రుత్వం ఉన్నా టెక్నాలజీ దగ్గరకు వచ్చేసరికి సెక్యూరిటీ పరమైనవి వాడుతారు..అయితే కిమ్ జాంగ్ దీనికి పూర్తిగా విరుద్ధం. శత్రు దేశంలో తయారైన వస్తువు ఏదైనా సరే అది ఎంత సెక్యూరిటీదైనా సరే దూరంగా ఉంచుతాడని తెలుస్తోంది. మరి ఈ శత్రుత్వం ఎప్పటికీ మిత్రుత్వంగా మారుతుందో వేచి చూడాలి.

14

14

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

Best Mobiles in India

English summary
Here Write North Korea's Kim Jong-un and the mystery smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X