మీ కాల్స్‌కి కనెక్ట్ కాలేం..జియోకి షాకిచ్చిన దిగ్గజ టెల్కోలు

By Hazarath
|

ఇండియాలో ఇప్పుడు అసలైన టెలికం పోరుకు తెర లేచింది. సంచలన ఆఫర్లతో జియో దూసుకొచ్చిన నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేయడానికి అన్ని టెల్కోలు ఏకమయ్యాయి. జియో నుంచి వచ్చే ఎటువంటి కాల్స్ ను తమ నెట్ వర్క్ పరిధిలో అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. దీంతో ఒక్కసారిగా జియో షాక్ కు గురయింది. అన్ని కంపెనీలు ఏకం కావడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది.

యాపిల్ ఐఫోన్ 7 వచ్చేసింది, ఇండియాలో ధర ఎంత? రిలీజ్ డేట్ ఎప్పుడు..?

#1

#1

ఇండియాలో అసలైన టెలికం వార్ కు తెరలేచింది. అత్యాధునిక 4 జీ ఎల్టీఈ వాయు తరంగాల ద్వారా తమ నెట్ వర్క్ లోని నంబర్లకు వచ్చే రిలయన్స్ జియో కాల్స్ ను అనుమతించే పరిస్థితి లేదని దిగ్గజ టెల్కోలు తేల్చి పారేశాయి.

#2

#2

ఈ మేరకు భారతీ ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ తదితర టెలికం కంపెనీలు ప్రధాన సభ్యుదారులుగా ఉన్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (కాయ్) నుంచి ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి లేఖ అందింది.

#3

#3

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కోరిక మేరకు ఇంటర్ కనెక్ట్ పాయింట్లను ఇచ్చేందుకు అవసరమైన నెట్ వర్క్ లేదా ఆర్థిక వనరులు తమ వద్ద లేవని ఈ లేఖలో టెల్కోలు కుండబద్దలు కొట్టాయి.

#4
 

#4

రిలయన్స్ జియో లాంచింగ్ గురించి ముఖేష్ అంబానీ ప్రకటన వెలువరించిన మరుసటి రోజు, అంటే, సెప్టెంబర్ 2 వ తేదీతో ఉన్న లేఖలో తమకు రావాల్సిన కాల్ కనెక్టివిటీ చార్జీలు తగ్గిపోతాయని, దీన్ని భరించే శక్తి తమకు లేదని, డేటా ఆధారిత కాల్స్ తాము ఇవ్వలేమని సభ్య కంపెనీలు స్పష్టం చేస్తున్నట్టు కాయ్ వెల్లడించింది.

#5

#5

ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లను ఇచ్చేందుకు తామెందుకు భారాన్ని మోయాలని ఈ లేఖలో కాయ్ డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ ప్రశ్నించారు. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీలను ఇప్పుడున్న విధంగానే తమకు చెల్లించే పక్షంలో మాత్రమే తాము సహకరిస్తామని ఈ లేఖలో ఆయన స్పష్టం చేశారు.

#6

#6

కాగా, ఇతర టెలికం కంపెనీలు జియో నుంచి తమ కస్టమర్లకు వచ్చే కాల్స్ ను కనెక్ట్ చేయడం లేదని ఇప్పటికే విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

#7

#7

ఒక్క ఫోన్ కాల్ చేయడానికి ఒకటికి నాలుగు, అయిదు సార్లు ఫోన్ చేయాల్సి వస్తోంది. అయితే సదరు నెట్ వర్క్ ఆపరేటర్లు సహకరించకపోవడంతో ఈ సమస్య ఎదురవుతుందని సమస్య త్వరలో పరిష్కారమవుతుందని జియో వెల్లడించిన కొద్ది రోజులకే ఇది చోటు చేసుకుంది.

#8

#8

అయితే జియో నెట్వర్క్ నుంచి కాల్ చేయాలంటే లాంగ్ టెర్మ్ ఎవెల్యూషన్ 4 జీ (ఎల్టీఈ) సపోర్టు చేసే మొబైల్ ఉంటే సరిపోదు. దానితోపాటు వాయిస్ వోవర్ లాంగ్ టెర్మ్ ఎవెల్యూషన్ (వీవోఎల్టీఈ లేదా వోల్టీ) ఉండాలి.

#9

#9

ఇతర నెట్వర్క్ల నుంచి కాల్ చేయాలంటే అవి 4 జీ ద్వారా వెళ్లవు. జియోలో కాల్స్ కూడా వోల్టీ ద్వారానే చేయాల్సి ఉంటుంది. అందుకే నాణ్యతతో కూడిన సేవలు అందుతాయి.

#10

#10

కేవలం మొబైల్ ఇంటర్నెట్ వాడుకోవాలంటే 4 జీ సపోర్టుచేసే మొబైల్ ఉంటేచాలు. 

#11

#11

కాల్ చేసుకోవాలంటే మాత్రం మరో అవకాశం ఉంది. మై జియో యాప్ ద్వారా డాటా ఆధారంగా నంబర్లకు కాల్ చేయొచ్చు. కొత్తగా వోల్టీకి సపోర్టు చేసే మొబైల్ కొంటే చాలు వెంటనే ఆయా స్టోర్స్లోనే జియో సిమ్ ఇచ్చేస్తున్నారు.

#12

#12

జియో కస్టమర్లు ఒక్క వారం వ్యవధిలోనే 5 కోట్ల కాల్స్ ఫెయిలైన సందర్భాలను చవిచూశారంటూ రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే.

#13

#13

నిబంధనలను ఉల్లఘించేందుకు జియోకు టెస్టింగ్ అనేది దొడ్డిదారి అని ప్రధాన టెలికం ఆపరేటర్ల ఆరోపణగా ఉంది. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ) లో ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్తోపాటు రిలయన్స్ జియోకు కూడా సభ్యత్వం ఉంది.

#14

#14

ఇప్పుడు అన్ని టెల్కోలు ఒక్కటై తాము జియోకు సహకరించలేమంటూ కాయ్ పీఎమ్ఓకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ టెలికం వార్ రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Best Mobiles in India

English summary
Here Write Not bound to give interconnect points to Reliance Jio: Telcos to PMO

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X