ఒసామా బిన్ లాడెన్‌ని ఒబామానే కాదు మనం కూడా చంపొచ్చు...!!

Posted By: Super

ఒసామా బిన్ లాడెన్‌ని ఒబామానే కాదు మనం కూడా చంపొచ్చు...!!

యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, ఆల్ ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడన్న వార్తని మే 2వ తేదీన వెల్లడించడం జరిగింది. ఐతే ఒసామా బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత ఒబామా అడ్మిన్మిస్ట్రేషన్ మాత్రం లాడెన్ చావుని పబ్లిసిటీ డ్రామాగానే చూపిస్తుంది. ఇది ఇలా ఉండగా లాడెన్ చనిపోయిన తర్వాత అతని మీద ఓ ఆన్‌లైన్ గేమ్‌ని తయారు చేశారు. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరుప్రఖ్యాతులు సంపాదించిన లాడెన్‌ని హాతమార్చాలంటే ఈగేమ్ ని మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.

కుమా గేమ్స్ అనే సంస్ద ఓ కొత్త గేమ్‌ని ప్రవేశపెట్టింది. ఆ కొత్త గేమ్ పేరు ఏమిటంటే కుమా వార్ ఎపిసోడ్ 107. ఈ గేమ్ వల్ల మీరు ఒసామా బిన్ లాడెన్‌ని చంపే అవకాశాన్ని పోందవచ్చు. ఈ గేమ్‌లో యూజర్స్ యుయస్ నేవీ సీల్స్ పాత్రను పోషిస్తారు. ఎక్కడో పాకిస్దాన్‌లోని రిమోట్ ఏరియాలో దాక్కున్నటువంటి ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ని కనిపెట్టి మరీ చంపడంలో నేవీ సీల్స్ ప్రముఖ పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

ఈగేమ్‌ ఎక్కడనుండి ప్రారంభం అవుతుందంటే అర్దరాత్రి పూట యుయస్ హెలికాప్ట్రర్స్ పాకిస్దాన్ ఏరియాలోకి ప్రవేశించిడం వద్ద నుండి మొదలవుతుంది. 79 నేవీ సీల్స్ ఆకాశం నుండి తాళ్శతో ఆల్ ఖైదా వ్యవస్దాపకుడూ ఒసామా బిన్ లాడెన్ నివసించినటువంటి కౌంపౌండ్‌లోకి దిగడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఆల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ని చంపవచ్చు. ఈ గేమ్ మొత్తం నలబైనిమిషాలు పాటు ఉంటుంది. దశాబ్ద కాలంపాటు దాగి ఉన్నటువంటి ఒసామా బిల్ లాడెన్‌ని నేవీ సీల్స్ ఎలా చంపారో అదే మాదిరి మీరు కూడా లాడెన్‌ని గేమ్ ద్వారా మట్టు పెట్టవచ్చు. కుమా వార్ గేమ్ అనేది ఫీ ఆన్ లైన్ వార్ గేమ్. ఇంకెందుకు మరి ఆలస్యం అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్‌ని అంతం చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot