మోడీ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న ఈ కామర్స్

Written By:

500, 1000 రూపాయల నోట్లను నిషేధించాలంటూ భారత ప్రధాని తీసుకున్న నిర్ణయం ఈ కామర్స్ మార్కెట్ ని పరుగులు పెట్టించింది. డిజిటల్ పేపెంట్స్, ఆన్లైన్ లేదా మొబైల్ వాలెట్స్ కంపెనీలకు అనూహ్యంగా అదృష్టం కలిసొచ్చింది. ఇక మొబైల్ వాలెట్ కంపెనీ 'పేటీఎం' అయితే మార్కెట్లో దుమ్మురేపుతోంది. వీటితో పాటు ఈ కామర్స్ దిగ్గజాలు కూడా తమ వ్యాపారాన్ని పెంచుకుంటూ పోతున్నాయి.

జియో మరో సంచలనం : త్వరలో జియో స్మార్ట్ కార్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేటీఎం చెల్లింపులు

ప్రధాని మోడీ నిర్ణయం దెబ్బతో ఒక్కసారిగా పేటీఎం చెల్లింపులు భారీగా పెరిగాయి. దీనికి సంబంధించిన యాప్ను డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య 200 శాతం పెరిగింది.

అబ్ ఏటీఎం నహీ పేటీఎం కరో

అబ్ ఏటీఎం నహీ పేటీఎం కరో అంటూ తమ వినియోగదారులకు పేటీఎమ్ పిలుపునిచ్చిన నేఫథ్యంలో వినియోగదారులు అమాంతంగా పెరిగిపోయారు.

ఫ్రీచార్జ్ వాలెట్'

ఇక మరో ఆన్లైన్ పేమెంట్ యాప్ 'ఫ్రీచార్జ్ వాలెట్' వ్యాపారం దేశవ్యాప్తంగా మూడింతలు పెరిగింది. ప్రతి 500 రూపాయల వ్యాపారంపైనా యాభై రూపాయలు రాయితీని ఇస్తామంటూ కూడా తాజాగా ఆ కంపెనీ ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబిక్విక్' వ్యాపారం

మరో ఆన్లైన్ పేమెంట్ సంస్థ 'మొబిక్విక్' వ్యాపారం కూడా బుధవారం నుంచి ఇప్పటివరకు ఏడింతలు పెరిగింది. రేపటి నుంచి ఏటీఎంలకు పరుగెత్తాల్సిన అవసరం లేదని మొబిక్విక్ను ఉపయోగించండి అంటూ మొబిక్విక్ సీఈవో బిపిన్ ప్రీత్ సింగ్ ఆనందంతో ట్వీట్ చేశారు.

ఓలా కంపెనీ

ఇక దేశంలోని 120 నగరాల్లో వినియోగదారులు రీచార్జి చేసుకోవడంలో 1500 శాతం అభివృద్ధి సాధించామని దేశవ్యాప్తంగా టాక్సీలను నడిపే ఓలా కంపెనీ ఆన్లైన్ పేమెంట్ సంస్థ 'ఓలామనీ' ప్రకటించింది. తాము రీచార్జిలపై మరింత మనీ ఆఫర్లు ఇస్తున్నామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

ఊబర్ కంపెనీ

ఊబర్ కంపెనీ కూడా ఓలా తరహాలో గణనీయంగా ప్రయోజనం పొందింది. కంపెనీ ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. 

క్యాష్ ఆన్ డెలవరి' సర్వీసులను

ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ వ్యాపార సంస్థలు మాత్రం 'క్యాష్ ఆన్ డెలవరి' సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, గిఫ్ట్ కార్డులు, మొబైల్ వాలెట్ పేపెంట్ లాంటి ప్రత్యామ్నాయాలను అనుసరించాల్సిందిగా పిలుపునిచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Notes demonetising: Brands like Paytm, Ola and Uber jump over the idea, markets affected Read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot