Home
News

నథింగ్‌ కొత్త ఫోన్‌ పైన సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు.. వచ్చే నెలలో విడుదల..!

నథింగ్ నుంచి త్వరలో భారత్‌ మార్కెట్‌లో నథింగ్ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ (Nothing Phone 2a Smartphone) లాంచ్‌ చేయనుంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా మార్చి 5న లాంచ్‌ కానుంది. ఈ సందర్భంగా నథింగ్‌ సంస్థ సీఈవో కార్ల్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్‌ మేడ్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారుచేస్తామని తెలిపారు. తన X పోస్ట్‌ ద్వారా సీఈవో ధ్రువీకరించారు.

ఈ ట్వీట్‌ ఆధారంగా యూకే ఆధారిత నథింగ్‌ సంస్థ.. భారత్‌ మార్కెట్‌పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కార్ల్‌ పై ఇటీవల X లో తన పేరును కార్ల్‌ భాయ్‌గా మార్చారు. భారత్‌లో టెస్లా ప్లాంట్‌ను నెలకొల్పాలంటే ఎలాన్‌ మస్క్‌ను కూడా పేరు మార్చుకోవాలని కోరారు. ఈ కామెంట్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Nothing Ceo confirmed that nothing Phone 2a to be made in india

రామన్‌ భాయ్‌ అనే యూజర్‌తో చాట్‌ అనంతరం కార్ల్‌ పే ఈ నిర్ణయం తీసుకున్నారు. నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో తయారు చేస్తారా అనే మరో యూజర్‌ ప్రశ్నకు కార్ల్‌ ప్లే 'అవును' అని సమాధానం ఇచ్చారు. మేడ్ ఇన్‌ ఇండియా లో భాగంగా ఈ ఫోన్లను తయారు చేయనున్నారు.

నథింగ్‌ ఫోన్‌ 2a స్పెసిఫికేషన్లు :
నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ వివరాలను యోగేష్‌ తన X ప్లాట్‌ఫాం ద్వారా కొన్ని వివరాలను లీక్‌ చేశారు. ఈ పోస్ట్‌ ఆధారంగా ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 అల్ట్రా చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS 2.5 పైన పనిచేసే అవకాశం ఉంది.

Nothing Ceo confirmed that nothing Phone 2a to be made in india

నథింగ్‌ ఫోన్‌ 2a వేరియంట్లు : ఈ హ్యాండ్‌సెట్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ ధర సుమారుగా రూ.30,000 ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ ధర రూ.35,000 గా ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్లను నథింగ్‌ ఫోన్‌ 2a పోటీ ఇవ్వనుందా : ఈ నథింగ్‌ ఫోన్‌ 2a స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 13 ప్రో+ మరియు రియల్‌మి 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్లతో పోటీనిచ్చే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ OLED డిస్‌ప్లే ను కలిగి ఉండే అవకాశం ఉంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది.

ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉండే అవకాశం ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. దాంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ నథింగ్‌ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ 32MP కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ నథింగ్ కొత్త హ్యాండ్‌సెట్ 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుందని తెలుస్తోంది. అయితే ఈ ఫోన్ బాక్స్‌లో 45W ఛార్జర్‌ను సంస్థ అందిస్తుందో లేదో స్పష్టత లేదు. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై నథింగ్‌ సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2a to be made in india Ceo confirmed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X