ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్‌ని దొంగిలిస్తున్న ఫేస్‌బుక్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు ఏదొ ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. డేటా స్కాం మరకలు ఇంకా ఫేస్‌బుక్ ని వదలలేదంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు ఏదొ ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. డేటా స్కాం మరకలు ఇంకా ఫేస్‌బుక్ ని వదలలేదంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మరకలు మాసిపోకముందే ఇప్పుడు మళ్లీ కొత్త మరకలు దానికి అంటుకున్నాయి.1.5 మిల్లియన్ యూజర్ల ఫోన్లలోని కాంటాక్ట్స్ సమాచారాన్ని ఫేస్‌బుక్ దొంగిలించిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్‌ని దొంగిలిస్తున్న ఫేస్‌బుక్

ఈ మెయిల్స్ ద్వార ఈ స్కాం జరుగుతున్న రిపోర్టులు చెబుతున్నాయి. పూర్తి వివరాల్లోకెళితే..

మీ పర్మిషన్ లేకుండానే

మీ పర్మిషన్ లేకుండానే

బిజినెస్ ఇన్ సైడర్ వెలువరించిన కథనం ప్రకారం సోషల్ మీడియా గెయింట్ ఫేస్‌బుక్ యూజర్లను కొత్తగా ఈమెయిల్ పాస్ వర్డ్ వెరిఫై చేసుకోమని అడుగుతోందట. అకౌంట్ లాగిన్ సమయంలో ఈ వెరిఫై వస్తుందట. ఆ పాప్ అప్ మెసేజ్ లో యూజర్లు పాస్ వర్డ్ ఎంటర్ చేసే సమయంలో మీ పర్మిషన్ లేకుండానే మీ ఫోన్ కాంటాక్ట్స్ ని ఫేస్‌బుక్ ఇంపోర్ట్ చేసుకుంటుందని సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

 

 

1.5 million యూజర్లు

1.5 million యూజర్లు

ఈ రిపోర్ట్ గురించి ఫేస్ బుక్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఇది నిజమేనని 2016 మే నుంచి ఇది జరుగుతూ వస్తోందని ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయని తెలిపారు. అయితే ఈ కాంటాక్ట్స్ ద్వారా ఎటువంటి అక్రమాలకు పాల్పటడం లేదని, సోషల్ మీడియాలో మరింతగా నెట్ వర్క్ విస్తరించుకునే భాగంలోనే ఇది చేశామని దీనికి యూజర్లకు గైడెన్స్ ఇవ్వడానికే ఇది చేశామని చెబుతున్నారు.

 

 

గత నెల నుంచి ఆపేశాం
 

గత నెల నుంచి ఆపేశాం

కాగా ఈ ఆరోపణలు రావడంతో గత నెల నుంచి ఫేస్‌బుక్ ఈ మెయిల్ వెరిఫికేషన్ ను ఆపేశామని లాగిన్ అయిన తొలిసారి మాత్రమే ఈ వెరిఫికేషన్ అడుగుతున్నామని ఆయన తెలిపారు. ఫేక్ అకౌంట్లు ఎక్కువవుతున్న తరుణంలో ఇటువంటి నిర్ణయం తీసుకోక తప్పడం లేదని ఆయన అన్నారు.

సెట్టింగ్ మెనూలోకి వెళ్లి తెలుసుకోవచ్చు

సెట్టింగ్ మెనూలోకి వెళ్లి తెలుసుకోవచ్చు

ఈ విషయాన్ని ఫేస్‌బుక్ కూడా ధృవీకరించింది. ఈ వెరిఫికేషన్ విధానాన్ని ఆపేశామని యూజర్లు దీనిపై రివ్యూ కూడా చేసుకోవచ్చని తెలిపింది. ఈ కాంటాక్ట్స్ ని వేరెవరకీ బదిలీ చేయడం లేదని వారికి సోషల్ మీడియాలో మరింతగా నెట్ వర్క్ పెంచుకునేందుకు మాత్రమే తీసుకున్నామని తెలిపింది. సెట్టింగ్ మెనూలోకి వెళ్లి వారే ఈ కాంటాక్ట్స్ షేర్ ఆప్సన్ పై రివ్యూ చేసుకోవచ్చని తెలిపింది.

 

 

గత కొద్ది కాలం నుంచి తీవ్ర దుమారం

గత కొద్ది కాలం నుంచి తీవ్ర దుమారం

ఫేస్‌బుక్ యూజర్ల డేటా చేతులు మారడంపై గత కొద్ది కాలం నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. అయితే ప్రముఖ వార్తా సంస్థ ఎన్‌బిసి కథనాల ప్రకారం జుకర్‌బర్గ్ ఆధ్వర్యంలో ఆయన సమక్షంలోనే డేటా ఇతరులకు చేరిందని అర్థమవుతోంది. దీంతో మరోసారి ఫేస్ బుక్ కో ఫౌండర్ వార్తల్లో నిలిచారు.

కొంత మంది యాప్ డెవలపర్స్‌కు

కొంత మంది యాప్ డెవలపర్స్‌కు

2011నుంచి 2015 మధ్య సుమారు 4000 పేజీల అంతర్గత రిపోర్ట్ బయటకు వచ్చింది. వాటి ప్రకారం కొంత మంది యాప్ డెవలపర్స్‌కు ఆయన డేటా అమ్మేందుకు సిద్ధపడ్డారని, ఇందుకోసం 100 డీల్స్ కూడా కుదుర్చుకున్నట్టు తేలింది. కాలిఫోర్నియాకు చెందిన ఈ సంస్థ ఫేస్ బుక్‌కు యాడ్స్ ఇచ్చే యాప్ సంస్థలకు ఈ డేటా అమ్మేందుకు సిద్ధపడింది.

యూజర్లకు చెందిన ప్రయివేటు సమాచారం తమ చేతుల్లో భద్రంగా ఉందని, అదే తమకు ప్రయార్టీ అని పదే పదే చెబుతూ వస్తున్న ఫేస్‌బుక్‌కు ఈ న్యూస్ మరో షాకింగ్ లాంటిది అని చెప్పవచ్చు. కొన్ని యాప్స్‌కు, మెసేజింగ్ సంస్థలకు ఫేస్ బుక్ ద్వారా యాక్సెస్‌ను నిరోధించేందుకు కూడా ఫేస్ బుక్ ప్రయత్నించింది. తమకంటే సదరు మెసేజింగ్ సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత వస్తోందనే ఉద్దేశంతో ఇలాంటి చేష్టలకు కూడా పాల్పడినట్టు తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన డాక్యుమెంట్లలో కొంత మంది ఉద్యోగులు జుకర్‌బర్గ్‌ను ''మాస్టర్ ఆఫ్ లెవరేజ్''గా పేర్కొన్నారు.

 

 

తమకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారని..

తమకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారని..

ఫేస్ బుక్‌తో పాటు సిక్స్4త్రీ అనే సంస్థకు మధ్య జరిగిన ఒప్పంద డాక్యుమెంట్ల బ్రిటిష్ జర్నలిస్ట్ డంకన్ క్యాంప్‌బెల్ సహా కొంత మంది మీడియా సంస్థల ప్రతినిధులకు చేరాయి. ఇప్పుడు ఇవి బయటకు పొక్కాయి. 4000 పేజీల్లో కేవలం 400 పత్రాలు మాత్రమే ఇప్పుడు బయటపడ్డాయి. కోర్టుకు గతంలో సిక్స్4త్రీ సంస్థ సమర్పించిన పత్రాల్లో కొన్ని బయటకు పొక్కాయి. తాజాగా వచ్చిన ఈ డాక్యుమెంట్లలో వాస్తవం లేదని, కొన్ని పత్రాలను బయటకు తీసి వాటిని తమకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారని ఫేస్ బుక్ యాజమాన్యం చెబ్తోంది.

Best Mobiles in India

English summary
Nothing is safe on Facebook, not even your email contacts heres why

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X