Home
News

Nothing New Products నథింగ్‌ సంస్థ ఏప్రిల్ 18వ తేదీన కీలక ప్రకటన చేయనుందా.. పూర్తి వివరాలు!

నథింగ్‌ సంస్థ ఇటీవల ఫోన్ 2a ను విడుదల చేసింది. త్వరలో ఈ సంస్థ నథింగ్‌ ఇయర్‌ 3 (Nothing Ear 3) పైన త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవల సంస్థ నుంచి వచ్చిన టీజర్‌ల ఆధారంగా నథింగ్‌ నుంచి మరో గ్యాడ్జెట్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. త్వరలో నథింగ్‌ ఇయర్‌ 3 తోపాటు మరో రెండు ఉత్పత్తులు లాంచ్‌ కానున్నాయని తెలుస్తోంది.

నథింగ్‌ ఇటీవల చేసిన X పోస్టు ఆధారంగా ఏప్రిల్ 18 న సంస్థ ఉత్పత్తుల విడుదలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఏయే గ్యాడ్జెట్‌లు విడుదల కానున్నాయనే సమాచారం వెల్లడి కాలేదు. కొన్ని నివేదికల ఆధారంగా నథింగ్‌ ఇయర్‌ 3 విడుదల కానుందని తెలుస్తోంది. నథింగ్‌ ఇయర్‌ 2 కంటే అనేక అప్‌గ్రేడ్‌ లను కలిగి ఉండే అవకాశం ఉంది.

Nothing may announce upcoming products list on april 18 news

నథింగ్‌ ఇయర్‌ 3 తోపాటు నథింగ్‌ స్పీకర్లను కూడా లాంచ్‌ చేసే అవకాశం ఉంది. అయితే ఈ విడుదలపై సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఫ్లిప్‌కార్ట్ లైవ్‌పేజీలో నథింగ్‌ ఇయర్‌ 3 కనిపించింది. అయితే ఎటువంటి వివరాలు మాత్రమే అందుబాటులో లేవు.

అయితే నథింగ్‌ ఇయర్‌ 2 తర్వాత తరం వెర్షన్‌గా ఇయర్‌ 3 విడుదల కానున్నాయని తెలుస్తోంది. నథింగ్ ఇయర్‌ 2.. 11.2mm కస్టమ్‌ డ్రైవర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ ఆధారిత మైక్రోఫోన్లు, టచ్‌ కంట్రోల్‌, మరియు 40dB వరకు యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్, బ్లూటూత్‌ 5.3 మరియు IP54 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. రూ.9999 కి భారత్‌లో లాంచ్‌ అయ్యాయి.

* నథింగ్‌ ఫోన్‌ 2a ఇటీవలే విడుదల అయింది. ఈ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ను రూ.23999కు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత నథింగ్‌ OS పైన పనిచేస్తోంది.

నథింగ్‌ ఫోన్ 2a వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) మరియు EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ నథింగ్‌ ఫోన్‌ 2a 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్‌ 8GB ర్యామ్‌ +128GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. బ్లాక్‌ మరియు వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Nothing may announce upcoming products list on april 18
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X