Home
News

Nothing Phone 2 విడుదలపై అధికారిక ప్రకటన చేసిన సంస్థ.. లాంచ్ ఎప్పుడంటే?

గత చాలా రోజుల నుంచి వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్‌ కీలక ప్రకటన చేసింది. నథింగ్‌ ఫోన్‌ (1) కొనసాగింపు వెర్షన్‌ Nothing phone 2 రానుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై నథింగ్‌ తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా అధికారిక ప్రకటన చేసింది.

carl Pei నేతృత్వంలోని యూకేకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ నథింగ్‌ ఫోన్‌2 కు సంబంధించిన చిన్న వీడియోను విడుదల చేసింది. అయితే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన డిజైన్‌, ఫీచర్లను వెల్లడించలేదు. కానీ సంస్థ విడుదల చేసిన వీడియోను బట్టి నథింగ్ ఫోన్‌(2) వెనుక ప్యానల్‌ గ్లిప్‌ ఇంట్‌ఫేస్‌తో రీడిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది.

Nothing phone 2

భారత్‌లోనే మొదటగా నథింగ్‌ ఫోన్‌ 2 లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. భారత్‌లో ఈ ఫోన్‌ తయారీని మరింత పెంచేందుకు నథింగ్‌ సంస్థ ప్లాన్‌ చేస్తోంది. నథింగ్‌ ఫోన్‌ 1 కూడా భారత్‌లోనే తయారుచేశారు. ఇటీవలే నథింగ్‌ ఫోన్‌2 BIS సర్టిఫికేట్‌ వెబ్‌సైట్‌లో మోడల్‌ నంబర్‌ AIN065 కనిపించింది. నథింగ్‌ ఫోన్‌ 1 తరహాలోనే నథింగ్‌ ఫోన్‌2 కూడా భారత్‌లో ఫిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. నథింగ్‌ ఫోన్‌(2) ఈ వేసవికాలంలోనే విడుదల చేస్తామని వెల్లడించింది.

నథింగ్ ఫోన్‌ 2 అమోలెడ్‌ డిస్‌ప్లేతో 120 Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ కానుంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 సీరిస్‌ చిప్‌సెట్‌తో విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్‌ స్టోరేజీతో రానుందని సమాచారం. నథింగ్‌ ఫోన్‌ (2) వెనుక భాగంలో చిన్న ఎరుపు రంగు లైట్‌ను అమర్చారు. ఏదైనా వీడియో రికార్డింగ్ చేసున్నప్పుడు ఆ లైట్‌ వెలుగుతూ ఉంటుంది.

నథింగ్ ఫోన్‌ 1 మాదిరిగానే ఫోన్‌2 డిజైన్‌ ఉండే అవకాశం ఉంది. ప్రీమియంగా నథింగ్‌ ఫోన్‌2 ను లాంచ్‌ చేయనున్నారు. అయితే కొన్ని అదనపు సెన్సార్‌లతో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో నథింగ్‌ ఫోన్‌ 2 లాంచ్ చేసే అవకాశం ఉంది.

ఫోన్‌ 1ను మిడ్‌ రేంజ్‌లో నథింగ్ సంస్థ లాంచ్‌ చేసింది. అదే ఫోన్‌ 2ను మాత్రం ప్రీమియం సిగ్మెంట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఫోన్‌ 1 కంటే ఉత్తమ చిప్‌సెట్‌, కెమెరా మరియు ఇతర అదనపు ఫీచర్‌లతో విడుదల చేసే అవకాశం ఉంది. ఫోన్‌ 1 మాదిరిగానే నథింగ్‌ ఫోన్‌2 ఆండ్రాయిడ్ ఆధారిత OSపై పనిచేయనుంది.

నథింగ్‌ సంస్థ ఫోల్టింగ్ ఫోన్‌ కూడా తీసుకువస్తోందని కొంత ప్రచారం జరిగింది. నథింగ్‌ కమ్యూనిటీ సభ్యుడు ఒకరు నథింగ్‌ ఫోల్డింగ్‌ ఫోన్‌ ఇలా ఉండబోతోందని ఓ ట్వీట్‌ చేశారు. శ్యామ్‌సంగ్‌, వివో, ఒన్‌ ఫ్లస్‌, గూగుల్‌ వంటి ప్రముఖ సంస్థలు ఫోల్డింగ్‌ ఫోన్లపై దృష్టిపెట్టిన నేపథ్యంలో నథింగ్‌ కూడా అటువంటి ప్రయత్నం చేస్తోందని కొంత చర్చ జరిగింది. అయితే నథింగ్‌ కమ్యూనిటీ సభ్యుడు షేర్‌ చేసింది కేవలం ఓ ఆలోచన మాత్రమేనని, ఫోన్‌ కాదని తర్వాత వెల్లడైంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing officially confirmed Phone 2 Launch in Summer 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X