నథింగ్ ఫోన్ 2a కొనుగోలు చేశారా.. వెంటనే మీ హ్యాండ్‌సెట్‌ను అప్‌డేట్ చేసుకోండి..!
నథింగ్ సంస్థ మార్చి 5 భారత్ మార్కెట్‌లోకి నథింగ్ ఫోన్ 2a (Nothing Phone 2a Smartphone) ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇటీవల ఈ ఫోన్ సేల్ ప్రారంభం కాగా కేవలం తొలి 60 నిమిషాల్లో 60,000 హ్యాండ్‌సెట్లను విక్రయించింది. ఇటీవల నథింగ్ సంస్థ నథింగ్ OS 2.5.3 పేరుతో అప్‌డేట్‌ను విడుదల చేసింది. కెమెరాకు సంబంధించిన పనితీరును మెరుగుపరిచింది.
తాజాగా నథింగ్ ఫోన్ 2a కోసం నథింగ్ OS 2.5.4 అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్‌గ్రేడ్ చేసుకోవాలని సంస్థ సూచించింది. ఈ అప్‌డేట్ ద్వారా వెనుక కెమెరాల కలర్, శాచురేషన్‌ను మెరుగుపరచనుంది. దీంతోపాటు ప్రైమరీ, అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాల మధ్య కలర్ నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపింది.

నథింగ్ OS 2.5.4 (Nothing OS 2.5.4) అప్‌డేట్ ద్వారా కెమెరా పనితీరును మెరుగుపరుస్తుంది. బొకేష్ ఎఫెక్ట్, పొర్ట్రెయిట్ మోడ్ మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఈ అప్‌డేట్‌తో గేమింగ్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. దీంతోపాటు రికార్డర్ విడ్జెట్ యానిమేషన్‌ను కూడా మెరుగుపరుస్తుంది.
దీంతోపాటు అనేక బగ్స్‌ను ఫిక్స్ చేసింది. యాప్‌ల లాంచింగ్ సమయంలో తలెత్తిన సమస్యకు అప్‌డేట్ ద్వారా నథింగ్ సంస్థ పరిష్కరించింది. మరియు హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ సమస్యను కూడా పరిష్కరించింది. వైఫై సహా ఇన్‌కమింగ్ కాల్స్ సమయంలో డిస్‌ప్లే వద్ద తలెత్తిన సమస్యకు ఈ అప్‌డేట్ ద్వారా నథింగ్ సంస్థ పరిష్కరించింది.

నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ సహా 1300 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 256GB ర్యామ్‌తో జతచేయబడుతుంది.
ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ OS పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు OS అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని నథింగ్ సంస్థ వెల్లడించింది. ఈ నథింగ్ ఫోన్ 2a 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
నథింగ్ కొత్త స్మార్ట్ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) మరియు EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటుంది. మరియు 50MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా మరియు ముందువైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ +128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.23,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్ ధర రూ.25,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.27,999 గా ఉంది. బ్లాక్ మరియు వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








