Home
News

Nothing Phone 1 డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి!! మీరు ఓ లుక్ వేయండి

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి మొదటిసారి అడుగుపెడుతున్న నథింగ్ కంపెనీ తన యొక్క మొదటి స్మార్ట్‌ఫోన్ ని ప్రీమియం విభాగంలో లాంచ్ చేయనున్నది. నథింగ్ ఫోన్ 1 పేరుతో రాబోతున్న ఈ ప్రీమియం ఫోన్ ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదల కానుంది. ఈ లాంచ్ కి సంబందించి వివరాలను ధృవీకరిస్తూ నథింగ్ ఆన్ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్‌ను చూపుతూ డివైస్ యొక్క మొదటి రూపాన్ని అధికారికంగా ఆవిష్కరించింది.

BIS

నథింగ్ కంపెనీ విడుదల చేసిన అధికారిక పోస్టర్ లో ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ LED ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను చూపుతుంది. ప్రీమియం విభాగంలో లభించే నథింగ్ ఫోన్ 1 సాలిడ్ వైట్ ఫినిషింగ్‌తో కనిపిస్తుంది. నథింగ్ ఇయర్ 1 TWS ఇయర్‌బడ్‌ల మాదిరిగానే ట్రాన్సపేరెంట్ డిజైన్‌ను కలిగి ఉండనున్నట్లు గతంలోనే హ్యాండ్‌సెట్ కి సంబందించిన లీక్ లు వచ్చాయి. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) యొక్క ధృవీకరణను కూడా పొందింది.

నథింగ్ ఫోన్ 1

వన్‌ప్లస్ సంస్థ యొక్క ఒకప్పటి సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ నేతృత్వంలోని UK బ్రాండ్ అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లలో నథింగ్ ఫోన్ 1 కు సంబందించిన డిజైన్‌ను షేర్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ యొక్క బ్యాక్ ప్యానెల్ వైట్ కలర్ తో గుండ్రని మూలల ముగింపుతో కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ LED ఫ్లాష్‌తో జత చేయబడిన బ్యాక్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా యూనిట్ హ్యాండ్‌సెట్ యొక్క ఎడమవైపు ఎగువ మూలలో అమర్చబడి ఉంది. అలాగే ఫోన్ దిగువభాగంలో ఎడమవైపు మూలలో నథింగ్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇంకా వాల్యూమ్ రాకర్స్ స్మార్ట్‌ఫోన్ యొక్క కుడివైపున కనిపిస్తాయి. అయితే ఎడమవైపు సైడ్ లో పవర్ బటన్ కనిపిస్తుంది.

టిప్‌స్టర్

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ (@stufflistings) తన యొక్క ట్విట్టర్ అకౌంటులో నథింగ్ ఫోన్ 1 కి సంబందించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లిస్టింగ్ స్క్రీన్‌షాట్‌లను ట్వీట్ చేశారు. లీక్ ప్రకారం ఫోన్ మరియు దాని బ్యాటరీ BIS నుండి ఆమోదం పొందాయి. టిప్‌స్టర్ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ A063తో రానున్నది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో పాటుగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్‌ మద్దతుతో రానున్నట్లు తెలిపారు. అదనంగా ఇది NFCని కూడా కలిగి ఉండవచ్చు.

రిటర్న్ టు ఇన్‌స్టింక్ట్

నథింగ్ ఫోన్ 1 ని జూలై 12 రాత్రి 8.30 గంటలకు IST లండన్‌లో 'రిటర్న్ టు ఇన్‌స్టింక్ట్' అనే వర్చువల్ ఈవెంట్‌ ద్వారా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కంపెనీ దీనిని ఇప్పటికి దృవీకరించలేదు. కానీ లాంచ్ దాని అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అయిత ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లను అందించనున్నదో వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OSలో రన్ అవుతుంది. అలాగే ఇది క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ SoC ద్వారా శక్తిని పొందుతుంది. భారతదేశంలో దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని రానున్నది. అయితే ఇది భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడుతుంది అని రూమర్ ఉంది. కానీ దీనిని కంపెనీ ధృవీకరించలేదు.

Best Mobiles in India

English summary
Nothing Phone 1 New Smartphone Design Details Revealed: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X