Just In
- 4 hrs ago
Android హోమ్ స్క్రీన్‌లో గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ షార్ట్‌కట్‌ని ఉంచడం ఎలా?
- 6 hrs ago
ఇనుములో ఓ హృదయం మొలిచెనే.. Xiaomi నుంచి తొలి హ్యుమనాయిడ్ రోబో!
- 6 hrs ago
రియల్‌మి కంపెనీ 2022లో ఎన్ని 5G ఫోన్లను లాంచ్ చేయనున్నదో తెలుసా?
- 23 hrs ago
OnePlus 10T 5G కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో బగ్ సమస్యలకు చెక్...
Don't Miss
- Lifestyle
Glass Skin: చర్మం అద్దంలా మెరిసిపోవాలా.. ఇలా చేయండి
- News
సోనియాగాంధీ పావులు... ప్రియాంక అంగీకారం?? ఆ రాష్ట్రంపై పట్టుకు పడుతున్న అడుగులు
- Finance
5G Jobs: 5G రాకతో కొత్త కొలువులు.. రానున్న మూడు నెలల్లో.. వీరికే అధిక డిమాండ్..
- Sports
Salman Butt : టీమిండియా పాలసీ సూపర్.. జట్టుకు ఢోకా లేదు
- Movies
Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?
- Automobiles
హోండా సిబి300ఎఫ్ టెస్ట్ రైడ్ రివ్యూ.. బోరింగ్ క్లాసిక్ బైక్‌లను పక్కన పెట్టి, ఈ స్పోర్టీ స్ట్రీట్ ఫైటర్‌ను ఎక్
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
ఫ్లిప్‌కార్ట్‌లో నథింగ్ ఫోన్ 1 ప్రీ-ఆర్డర్ పాస్!! పూర్తి వివరాలు ఇవిగో...
నథింగ్ ఫోన్ 1 ప్రీమియం ఫోన్ ప్రపంచవ్యాప్తంగా జూలై 12న విడుదల కానున్నది. నథింగ్ ఫోన్ 1 విడుదల కావడానికి ముందుగా డిజైన్ లీక్ లతో అందరి దృష్టిని ఆకట్టుకున్నది. ఇండియాలో ఈ ఫోన్ యొక్క ప్రీ-ఆర్డర్ వివరాలు ఫ్లిప్‌కార్ట్‌లో క్లుప్తంగా కనిపించాయి. అందులోని సమాచారం ప్రకారం రీఫండబుల్ ధరలో లభించే డెడికేటెడ్ ప్రీ-ఆర్డర్ పాస్ ద్వారా ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నట్లు చూపుతున్నది. ఈ ప్రీ-ఆర్డర్ పాస్ వచ్చే నెలలో ఫోన్ అధికారికంగా ప్రారంభించిన కొద్దిసేపటికే నథింగ్ ఫోన్ 1ని పొందడానికి వీలుగా ఇన్విటేషన్ లింక్ వలె పని చేస్తుంది.

ఈ ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ పద్దతిలో కొనుగోలు చేయడానికి ప్రయత్నించే కస్టమర్‌లు తగ్గింపు ధరతో పాటుగా నథింగ్ ఫోన్ 1 యొక్క యాక్సెసరీల అదనపు ప్రయోజనాలు మరియు డిస్కౌంట్ ఆఫర్‌లను పొందేందుకు కూడా అర్హులు అవుతారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతదేశంలో 'నథింగ్ ఫోన్ 1 ఫ్లిప్‌కార్ట్ ప్రీ-ఆర్డర్ పాస్' కి సంబందించి టిప్‌స్టర్ ముకుల్ శర్మ కొన్ని స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. వీటి ప్రకారం నథింగ్ ఫోన్ 1 ప్రీ-ఆర్డర్ పాస్ ను పొందడానికి రూ.2,000 తిరిగి చెల్లించదగిన డిపాజిట్ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది అని అందుబాటులో గల స్క్రీన్‌షాట్‌లు సూచిస్తున్నాయి. ఈ పాస్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేయగలరు. ప్రీ-ఆర్డర్ పాస్ ని పొందిన వారు నథింగ్ ఫోన్ (1)ని ముందస్తుగా ఆర్డర్ చేయగలరని హామీ ఇస్తుంది. అయితే ఇది అసలు ఆర్డర్ కాదు అని గుర్తుంచుకోండి.

రూ.2,000 రీఫండబుల్ మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌లకు ఇన్విటేషన్ కోడ్‌ను ఇమెయిల్ చేస్తుంది. పాస్ కొన్ని ప్రత్యేకమైన ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అలాగే ఫోన్ 1 యాక్సెసరీ యొక్క తగ్గింపు ధరను కూడా అందిస్తుంది. ప్రీ-ఆర్డర్ పాస్‌ను కలిగి ఉన్న కస్టమర్‌లు నథింగ్ ఫోన్ 1ని ఫ్లిప్‌కార్ట్ నుండి దాని లాంచ్ తేదీన జూలై 12 రాత్రి 9 గంటల లోపు కొనుగోలు చేయగలరు. స్క్రీన్‌షాట్‌లలోని వివరాల ప్రకారం పాస్ కోసం చెల్లించిన రూ.2,000 డిపాజిట్ మొత్తం తుది ధర నుండి తీసివేయబడుతుంది. అలాగే దీని కొనుగోలు మీద ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు మరియు నో-కాస్ట్ EMIని కూడా కలిగి ఉంటుంది.

నథింగ్ ఫోన్ 1 యొక్క ముందస్తు ఆర్డర్ యొక్క ఇన్విటేషన్ లింక్ ఈ వారం ప్రారంభంలో అందుబాటులో ఉంటుందని నథింగ్ కంపెనీ స్వయంగా వెల్లడించింది. ఇది ఫోన్‌కు ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవడానికి అలాగే మార్కెట్లో దాని హైప్‌ను సృష్టించడానికి కంపెనీకి సహాయపడుతుంది. నథింగ్ CEO మరియు సహ-వ్యవస్థాపకుడు కార్ల్ పీ గతంలో OnePlusలో తన మునుపటి పదవీకాలంలో విక్రయ ఆహ్వానాల ద్వారా కస్టమర్లను ఆకర్షించే వ్యూహాన్ని ఉపయోగించలేదు. చైనీస్ కంపెనీ వన్‌ప్లస్ వన్‌తో సహా దాని ప్రారంభ మోడళ్లను ఆహ్వానం-మాత్రమే మెకానిజం ద్వారా విక్రయించింది. అది జనాదరణ పొందడంలో సహాయపడింది.

వన్‌ప్లస్ సంస్థ యొక్క ఒకప్పటి సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సంస్థ నుంచి బయటకు వచ్చి నథింగ్ బ్రాండ్ ని స్థాపించాడు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లోకి మొదటిసారిగా నథింగ్ ఫోన్ 1 పేరుతో కంపెనీ యొక్క మొదటి స్మార్ట్‌ఫోన్ ని ప్రీమియం విభాగంలో లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఫోన్ కి సంబందించిన డిజైన్ వివరాలు కూడా ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ (@stufflistings) తన యొక్క ట్విట్టర్ అకౌంటులో నథింగ్ ఫోన్ 1 కి సంబందించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లిస్టింగ్ స్క్రీన్‌షాట్‌లను ట్వీట్ చేశారు. లీక్ ప్రకారం ఫోన్ మరియు దాని బ్యాటరీ BIS నుండి ఆమోదం పొందాయి. టిప్‌స్టర్ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ మోడల్ నంబర్ A063తో రానున్నది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో పాటుగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ మద్దతుతో రానున్నట్లు తెలిపారు. అదనంగా ఇది NFCని కూడా కలిగి ఉండవచ్చు. నథింగ్ ఫోన్ 1 ని జూలై 12 రాత్రి 8.30 గంటలకు IST లండన్‌లో 'రిటర్న్ టు ఇన్‌స్టింక్ట్' అనే వర్చువల్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కంపెనీ దీనిని ఇప్పటికి దృవీకరించలేదు. కానీ లాంచ్ దాని అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అయిత ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లను అందించనున్నదో వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OSలో రన్ అవుతుంది. అలాగే ఇది క్వాల్‌కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ SoC ద్వారా శక్తిని పొందుతుంది. భారతదేశంలో దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొని రానున్నది. అయితే ఇది భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడుతుంది అని రూమర్ ఉంది. కానీ దీనిని కంపెనీ ధృవీకరించలేదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086