Nothing Phone 1 ధరలు భారీగా పెరిగాయి!! కొత్త ధరలు ఇవిగో...

|

లండన్ ఆధారిత నథింగ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నథింగ్ ఫోన్ 1 ను లాంచ్ చేసింది. భారతదేశంలో నెల ముందు లాంచ్ అయిన ఈ ఫోన్ యొక్క ధర అన్ని వేరియంట్ల మీద రూ.1,000 పెంచబడింది. కరెన్సీ మారకపు రేట్ల హెచ్చుతగ్గులు వంటి ఇతర కారణాల దృష్ట్యా స్మార్ట్‌ఫోన్ యొక్క ధరను పెంచనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ LED స్ట్రిప్స్‌ను ఉపయోగించే గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌తో పాటుగా పారదర్శక బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల OLED డిస్‌ప్లే మరియు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoC వంటి గొప్ప ఫీచర్లను కలిగి ఉన్న దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

నథింగ్ ఫోన్ 1 పెరిగిన కొత్త ధరల వివరాలు

నథింగ్ ఫోన్ 1 పెరిగిన కొత్త ధరల వివరాలు

భారతదేశంలో నథింగ్ ఫోన్ 1 ఇటీవల 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.32,999, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.35,999 మరియు 12GB RAM + 256GB స్టోరేజ్ టాప్-ఆఫ్-ది-లైన్ వేరియంట్‌ రూ.38,999 ధరల వద్ద లాంచ్ అయ్యాయి. అయితే కొత్తగా రూ.1,000 ధర పెంపును అందుకున్న తరువాత నథింగ్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ నుండి అందిన సమాచారం ప్రకారం భారతదేశంలో నథింగ్ ఫోన్ 1 యొక్క 8GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర ఇప్పుడు రూ.33,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ యొక్క ధర రూ.36,999 కాగా టాప్-ఆఫ్-ది-లైన్ 12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.39,999. ధర మార్పు ఈరోజు నుండి అమలులోకి వస్తుందని కంపెనీ పేర్కొన్నప్పటికీ ఈ స్టోరీ వ్రాసే సమయానికి మేము Flipkartలో పాత ధరలతో జాబితా చేయబడిన నథింగ్ ఫోన్ 1ని చూడగలిగాము. ధర మార్పు త్వరలో చూపుతుంది అని భావిస్తున్నాము.

నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్స్
 

నథింగ్ ఫోన్ 1 స్పెసిఫికేషన్స్

నథింగ్ ఫోన్ 1 యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12 పై రన్ అవుతుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 6.55-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇతర డిస్‌ప్లే ఫీచర్‌లలో HDR10+ సపోర్ట్, 402 ppi పిక్సెల్ డెన్సిటీ మరియు 1,200 nits పీక్ బ్రైట్‌నెస్ కూడా ఉన్నాయి. ఇది హుడ్ కింద క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoCతో శక్తిని పొందుతూ 12GB వరకు LPDDR5 RAMతో జత చేయబడి వస్తుంది.

ఆప్టిక్స్

నథింగ్ ఫోన్ 1 యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో రెండు 50-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో మొదటిది 50-మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ ƒ/1.88 అపెర్చర్ లెన్స్‌తో జత చేయబడి ఉండి OIS అలాగే EIS ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. రెండవది ƒ/2.2 ఎపర్చరుతో 50-మెగాపిక్సెల్ సెన్సార్ Samsung JN1 మరియు అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది EIS ఇమేజ్ స్టెబిలైజేషన్, 114-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ మరియు మాక్రో మోడ్‌తో వస్తుంది. ఫోన్ పనోరమా నైట్ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, సీన్ డిటెక్షన్, ఎక్స్‌ట్రీమ్ నైట్ మోడ్ మరియు ఎక్స్‌పర్ట్ మోడ్‌తో సహా పలు ఫీచర్లను అందిస్తుంది. ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ƒ/2.45 ఎపర్చరు లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉంది.

కనెక్టివిటీ ఎంపిక

నథింగ్ ఫోన్ 1 యొక్క ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది 256GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi 6 డైరెక్ట్, బ్లూటూత్ v5.2, NFC, GPS/A-GPS, GLONASS, GALILEO, QZSS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ మరియు ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. నథింగ్ ఫోన్ 1 33W వైర్డ్ ఛార్జింగ్, 15W Qi వైర్‌లెస్ ఛార్జింగ్ మరియు 5W రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. నథింగ్ ఫోన్ 1లోని ఇతర ఫీచర్లలో ఫేస్ కవరింగ్‌లతో పనిచేసే ఫేషియల్ రికగ్నిషన్, డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ కోసం IP53 రేటింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు మూడు మైక్రోఫోన్‌లు ఉన్నాయి. వ్యక్తిగత పరిచయాలు మరియు ఇతర నోటిఫికేషన్‌ల కోసం ఫోన్ వెనుక భాగంలో లైటింగ్ ప్రభావాలను వ్యక్తిగతీకరించడానికి వినియోగదారులను అనుమతించే గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఉంది.

Best Mobiles in India

English summary
Nothing Phone 1 Price Hiked Up to Rs.1,000 in India: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X