భారత్ లోనే Nothing phone 1 తయారీ.. తొలి మొబైల్ విడుదల ఎప్పుడంటే!

|

భారత్ లో "Nothing phone 1" మొబైల్స్ తయారీ పై ఆ సంస్థ స్పష్టతనిచ్చింది. త్వరలో నథింగ్ ఫోన్ వన్ మొబైల్స్ తయారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మొబైల్స్ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పటికీ బ్యాటరీలను మాత్రం చైనా నుంచి దిగుమతి చేసుకోనున్నారు. తొలి మొబైల్ ను జులై 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్స్ ఇండియా లో ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో వుండనున్నాయి.

 
భారత్ లోనే Nothing phone 1 తయారీ.. తొలి మొబైల్ విడుదల ఎప్పుడంటే!

ఈ సంస్థ భారత వైస్ ప్రెసిడెంట్ , జనరల్ మేనేజర్ మను శర్మ ట్విట్టర్ లో ఈ విధంగా వెల్లడించారు. "భారత మార్కెట్ మాకు ఎంతో కీలకం. భారత్ లో అమ్మబోయే ప్రతి నథింగ్ ఫోన్ 1 మొబైల్ ఇండియా లోనే తయారు చేయడం జరుగుతుంది. మమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ప్రయాణం మాకు ఎంతో ముఖ్యమైంది. " అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ మొబైల్స్ భారత్ లో విడుదల దృష్ట్యా కస్టమర్ సపోర్ట్ ను మెరుగు పరిచేందుకు సంస్థ కృషి చేస్తోంది. మొత్తం 250 నగరాల్లో 270 సర్వీస్ సెంటర్స్ ను ప్రారంభించనుంది. జులై 12వ తేదీన రిటర్న్ ఇన్స్టింక్ట్ పేరుతో జరగబోయే ఈవెంట్ లో ఈ మొబైల్స్ ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం నథింగ్ ఫోన్ 1 ఫీచర్లు ఇలా వున్నాయి:
నథింగ్ ఫోన్ 1 "వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ " డ్యూయల్ కెమెరాతో రానుంది. వెనక వైపు సింగల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ ని కలిగివుంది. ఈ మొబైల్ ఐ ఫోన్ 12 , 13 తరహా డిజైన్ తో 7.55 mm డిస్ప్లే తో తయారు చేస్తున్నారు. దీనికి ఫ్లాష్ పనెల్ డిస్ప్లే ని అందిస్తున్నారు. ఈ మొబైల్ లో క్వాల్ కామ్ స్నాప్ద్రగోన్ ప్రాసెసర్ ని అమర్చారు. అంతే కాకుండా ఈ మొబైల్ కి 8జీబీ రామ్, మరియు 128 / 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కల్పిస్తున్నారు. ఇక బాటరీ విషయానికి వస్తే 4500 mAh వరకు ఉండొచ్చని సమాచారం. దీని ఫీచర్లని బట్టి చూస్తే ఈ మొబైల్ ధర మార్కెట్ లో దాదాపు రూ. ౩౦౦౦౦ వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బ్లాక్ మరియు వైట్ కలర్స్ లో ఇది అందుబాటులోకి రానుంది. నథింగ్ ఫోన్ 1 మొబైల్స్ జులై 12 నుంచి ఫ్లిప్ కార్ట్ వేదికగా భారత్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.

Best Mobiles in India

English summary
Nothing phone 1 to be manufactured in india. company revealed launch date and other details.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X