Flipkart Sale 2024.. Nothing ఫోన్ 2 పైన రూ.10వేల తగ్గింపు.. ఆ బ్యాంక్ కార్డుపై మరో రూ.2వేల డిస్కౌంట్.!
నథింగ్ ఫోన్ 2 పై (Nothing Phone 2) సంస్థ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ జులై 2023న భారత్‌లో విడుదల అయింది. 3 ర్యామ్, అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్.. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంది. అయితే జనవరి 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నథింగ్ సంస్థ తన నథింగ్ ఫోన్ 2 హ్యాండ్‌సెట్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటన చేసింది. బ్యాంకు ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో ఈ ఫోన్‌ను మరింత తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ 2 అన్ని వేరియంట్లపైనా తగ్గింపు ధరను పొందవచ్చు.

నథింగ్ ఫోన్ 2 హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్+ 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ప్రస్తుత ధర రూ.44,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.34,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మిగిలిన వేరియంట్ల తగ్గింపు ధరలు సేల్ ప్రారంభం అయ్యాక వెల్లడికానున్నాయి. డార్క్ గ్రే, తెలుపు రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.
నథింగ్ ఫోన్ 2 విడుదల సమయంలో 8GB ర్యామ్ +128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,999గా ఉంది. అదే 12GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. అదే 12GB ర్యామ్ +512GB వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. డిసెంబర్ 2023లో ఈ ఫోన్లపై తొలిసారిగా తగ్గింపు ధర ప్రకటన వెలువడింది.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్ 2ను కొనుగోలు చేసే కస్టమర్లకు సంస్థ మరో ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చింది. రూ.2999 విలువైన నథింగ్ 65W GaN ఛార్జర్‌ను రూ.1999కే కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఈ ఛార్జర్ ద్వారా కేవలం 25 నిమిషాల్లో 0-25 శాతం ఛార్జింగ్‌ను పూర్తి చేయవచ్చని సంస్థ తెలిపింది. ఈ ఫోన్ 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ICICI బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 వరకు ప్రత్యేక తగ్గింపు ధరను పొందుతారని పేర్కొంది. ఎంపిక చేసిన హ్యాండ్‌సెట్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా అదనంగా రూ.3000 వరకు తగ్గింపును పొందవచ్చని నథింగ్ సంస్థ వెల్లడించింది. బ్యాంకింగ్ డిస్కౌంట్లు, ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమేనని నథింగ్ సంస్థ స్పష్టం చేసింది.

నథింగ్ ఫోన్ 2.. 6.7 అంగుళాల పుల్ హెచ్‌డీ+ (1080*2412 పిక్సల్) LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు రీఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hz వరకు ఉంటుంది. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. HDR10+ ను సపోర్టు చేస్తుంది.
ఈ ఫోన్ క్వాల్‌కాం 4nm స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 SoC అడెన్నో 730 GPU చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS 2.0 పై పనిచేస్తుంది. హై డెఫినిషన్ మైక్రోఫోన్లు మరియు డ్యూయల్ స్టీరియో స్పీకర్ వ్యవస్థను కలిగి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2 వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. 50MPతోపాటు 1/1.56 అంగుళాల సోనీ IMX890 f/1.88 అపేచర్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంటుంది. మరియు 50MP ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో పాటు 1/2.76 అంగుళాల శాంసంగ్ Jn1 సెన్సార్ సహా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంటుంది. 114 డిగ్రీల ఫీల్డ్ వ్యూతోపాటు f/2.2 అపేచర్‌తో వస్తుంది.
32MP సెల్ఫీ కెమెరా : ఈ కెమెరాల ద్వారా 4k వీడియోలను రికార్డు చేయవచ్చు. 480fps స్లో మోషన్ వీడియోలను కూడా రికార్డు చేసుకోవచ్చు. మరియు ముందువైపు 32MP కెమెరాతోపాటు 1.2.74 అంగుళాల సోనీ IMX615 సెన్సార్ మరియు f/2.45 అపేచర్‌తో వస్తుంది.
నథింగ్ ఫోన్ 1 తరహాలోనే ఫోన్2 కూడా గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్ 10 కొత్త రింగ్‌టోన్లు, నోటిఫికేషన్ సౌండ్‌లను సపోర్టు చేస్తుందని నథింగ్ సంస్థ పేర్కొంది. బ్యాటరీ ఛార్జింగ్, టైమర్ మాదిరిగా యాప్‌ల ప్రోగ్రస్‌ను చూడవచ్చు. నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్ WiFi 6, 5G, 4G LTE, బ్లూటూత్ 5.3ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు రెండు యాంబియంట్ లైట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








