Home
News

ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక ఆఫర్‌.. తక్కువ ధరకే నథింగ్‌ ఫోన్ 2 సేల్‌.. ఈ బ్యాంకు కార్డుపై రూ.2000 అదనపు తగ్గింపు.

నథింగ్‌ సంస్థ ఇటీవల భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2a ను విడుదల చేసింది. ప్రస్తుతం నథింగ్‌ ఫోన్ 2 ను (Nothing Phone 2 Smartphone Discount price) తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.44,999 విడుదల కాగా ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ రూ.35,999 కే కొనుగోలు చేయవచ్చు. పూర్తి వివరాలు మీకోసం.

నథింగ్‌ ఫోన్ 2 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ, 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.35,999 గా ఉంది. అదే 256GB వేరియంట్‌ రూ.36,999, 512GB వేరియంట్‌ రూ.38,999 గా ఉంది.

Flipkart offers best discount offer on Nothing phone 2

ఈ నథింగ్‌ ఫోన్‌ 2 డార్క్ గ్రే, వైట్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంకు క్రెడిట్‌ మరియు డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు కాంబో ఆఫర్ కింద రూ.1999 కే CMF ఛార్జర్‌ మరియు రూ.1000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఫ్లిప్‌కార్ట్‌ నిబంధనలకు అనుగుణంగా రూ.33,000 ఎక్స్చేంజీ ప్రయోజనాలను పొందవచ్చు.

నథింగ్‌ ఫోన్‌ 2... 1Hz నుంచి 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల పుల్ HD+ LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4nm క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌1 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తోంది. అడెన్నో 730 GPUతో జతచేయబడి ఉంటుంది.

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ ఆధారిత నథింగ్‌ OS 2.0 పై పనిచేస్తుంది. ఈ హ్యండ్‌సెట్ 3 సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ ఇస్తామని నథింగ్ సంస్థ వెల్లడించింది. ఈ ఫోన్‌ మూడు హై డెఫినిషన్‌ మైక్రోఫోన్లు మరియు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

నథింగ్‌ ఫోన్‌ 2 వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. f/1.88 అపేచర్‌తో 50MP అంగుళాల సోనీ IMX890 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్‌ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టును కలిగి ఉంటుంది. 50MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా మరియు శాంసంగ్‌ Jn1 సెన్సార్‌ను కలిగి ఉంటుంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

నథింగ్‌ ఫోన్‌ 2 హ్యాండ్‌సెట్ 45W ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంది. 55 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు. అదే 15W QI వైర్‌లెస్‌ ఛార్జర్‌తో 130 నిమిషాల్లో ఛార్జింగ్‌ అవుతుందని తెలిపింది. మరియు 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుందని నథింగ్‌ పేర్కొంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing phone 2 smartphone gets best discount on Flipkart 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X