Home
News

6.7 అంగుళాల డిస్‌ప్లే, 512GB స్టోరేజీ నథింగ్‌ ఫోన్‌ ధర రూ.5000 తగ్గింపు.. స్పెసిఫికేషన్లు, సేల్‌ వివరాలు!

నథింగ్‌ సంస్థ నుంచి ఈ నెలలో నథింగ్‌ ఫోన్‌ 2a విడుదల కానుంది. తాజాగా ఈ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. నథింగ్‌ ఫోన్‌ 2 (Nothing Phone 2) ధరను తగ్గిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్‌లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ తొలిసారిగా ధర రూ.5000 తగ్గింది. మళ్లీ ఈ నెలలో మరోసారి ధర తగ్గింది.

నథింగ్‌ ఫోన్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్+ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌, 12GB ర్యామ్‌+ 256GB స్టోరేజీ వేరియంట్‌ మరియు 12GB ర్యామ్+ 512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్‌, వైట్‌ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి.

Nothing Phone 2 smartphone

భారీగా ధర తగ్గింపు : 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌పై ధర రూ.2000 తగ్గింది. 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.37,999 గా ఉంది. అదే 12GB ర్యామ్‌ + 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.5000 తగ్గింది. ఫలితంగా ఈ వేరియంట్‌ను రూ.39,999 కే సొంతం చేసుకోవచ్చు.

నథింగ్‌ ఫోన్‌ 2 6.7 అంగుళాల పుల్ హెచ్‌డీ+ LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు రీఫ్రెష్‌ రేట్‌ 1Hz నుంచి 120Hz వరకు ఉంటుంది. 240Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. HDR10+ ను సపోర్టు చేస్తుంది. క్వాల్‌కాం 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8+ జెన్‌1 SoC అడెన్నో 730 GPU చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ ఆధారిత నథింగ్‌ OS 2.0పై పనిచేస్తుంది.

Nothing Phone 2 smartphone

నథింగ్‌ ఫోన్‌ 2 వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MPతోపాటు 1/1.56 అంగుళాల సోనీ IMX890 f/1.88 అపేచర్‌ మరియు ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌, ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంటుంది. మరియు 50MP ఆల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరాతో పాటు 1/2.76 అంగుళాల శాంసంగ్‌ Jn1 సెన్సార్‌ సహా ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ను కలిగి ఉంటుంది. 114 డిగ్రీల ఫీల్డ్‌ వ్యూతోపాటు f/2.2 అపేచర్‌తో వస్తుంది.

ఈ కెమెరాల ద్వారా 4k వీడియోలను రికార్డు చేయవచ్చు. 480fps స్లో మోషన్‌ వీడియోలను కూడా రికార్డు చేసుకోవచ్చు. మరియు ముందువైపు 32MP కెమెరాతోపాటు 1.2.74 అంగుళాల సోనీ IMX615 సెన్సార్‌ మరియు f/2.45 అపేచర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ మూడు హై డెఫినిషన్‌ మైక్రోఫోన్లు మరియు డ్యూయల్‌ స్టీరియో స్పీకర్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్‌ 45W పీపీఎస్‌ ఛార్జర్‌ సపోర్టుతో 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఛార్జర్‌తో కేవలం 55 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు. 15W QI వైర్‌లెస్‌ ఛార్జర్‌తో 130 నిమిషాల్లోనే ఛార్జింగ్ చేయవచ్చు. మరియు 5W రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుందని నథింగ్‌ పేర్కొంది.

నథింగ్ ఫోన్‌2 కూడా గ్లిఫ్‌ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ ఫోన్‌ 10 కొత్త రింగ్‌టోన్లు, నోటిఫికేషన్‌ సౌండ్‌లను సపోర్టు చేస్తుందని నథింగ్‌ సంస్థ పేర్కొంది. బ్యాటరీ ఛార్జింగ్, టైమర్‌ మాదిరిగా యాప్‌ల ప్రోగ్రస్‌ను చూడవచ్చు. నథింగ్‌ ఫోన్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ WiFi 6, 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.3ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు రెండు యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Phone 2 smartphone second price cut in india Feb 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X