ప్రీమియం ఫోన్‌గా రానున్న Nothing ఫోన్2.. విడుదల ఎప్పుడంటే?
స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నథింగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ Nothing phone2 త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ విడుదలపై నథింగ్ సంస్థ సీఈవో కార్ల్ పే ఓ ఇంటర్య్వూలో స్పష్టత ఇచ్చారు. 2022లో నథింగ్ సంస్థ తన తొలి స్మార్ట్‌ఫోన్ Nothing Phone1 విడుదల చేసింది. అప్పటి నుంచి నథింగ్ ఫోన్2 విడుదలపై ఆసక్తి నెలకొంది. అయితే నథింగ్ ఫోన్2 ప్రీమియం కేటగిరీ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ కానుందని తెలుస్తోంది.
నథింగ్ ఫోన్2 స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్‌సెట్‌తో రానుందని సంస్థ సీఈవో కార్ల్ పే వెల్లడించారు. స్నాప్ డ్రాగన్ 8 జెన్2 చిప్‌సెట్‌కు బదులుగా స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 ను వినియోగించడంపైనా కార్ల్‌పే స్పష్టత ఇచ్చారు. 8+ జెన్1 చిప్‌సెట్ వివిధ అప్‌డేట్లతో ఆప్టీమైజ్ చేయబడిందని తెలిపారు.

స్పెసిఫికేషన్ల రేసులో తొలి స్థానంలో ఉండడం కంటే వినియోగదారునికి మెరుగైన అనుభూతిని ఇవ్వడంపైనే నథింగ్ సంస్థ దృష్టి ఉంటుందని తెలిపారు. ధర కూడా స్మార్ట్‌ఫోన్ కొనుగోలును ఎంతో ప్రభావితం చేస్తుందని కార్ల్ పే అన్నారు. 2022లో విడుదల అయిన నథింగ్ ఫోన్1 బ్యాటరీ సామర్థ్యం 4500mAh కాగా.. ఫోన్2 మాత్రం 4700mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానుందని తెలిపారు. జులైలో నథింగ్ ఫోన్2 ను లాంచ్ చేస్తామని సీఈవో కార్ల్ పే ప్రకటించారు.
నథింగ్ ఫోన్1: నథింగ్ సంస్థ తన తొలి స్మార్ట్‌ఫోన్ Nothing Phone1ను 2022లో విడుదల చేసింది. ఫోన్1 6.55 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు HDR 10+ సపోర్టుతో లాంచ్ అయింది. మరియు డిస్‌ప్లే 120Hz రీఫ్రెస్ రేట్‌ను కలిగి ఉంది. ఫోన్1 గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. ఇది కాల్స్, మెసేజ్‌లు, ఛార్జింగ్ స్టేటల్ నోటిఫికేషన్‌లను విభిన్నంగా తెలియజేస్తుంది.
ఈ ఫోన్ గొరెల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. మరియు చివరల్లో అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది, ఇది కాల్‌లు, సందేశాలు మరియు ఛార్జింగ్ స్థితి వంటి విభిన్న నోటిఫికేషన్‌లను సూచించడానికి ప్రత్యేకమైన కాంతి నమూనాలను చూపుతుంది. నథింగ్ ఫోన్ 1 స్నాప్ డ్రాగన్ 778G+ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. మరియు 12GB ర్యామ్, 256 స్టోరేజీతో వస్తుంది.
నథింగ్ ఫోన్ 1 డ్యూయర్ 50MP కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ సోనీ IMX766 సెన్సార్ మరియు శాంసంగ్ రూపొందించిన 50MP ఆల్ట్రావైడ్ కెమెరాలను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4500mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. మరియు 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. నథింగ్ ఫోన్1 ఆండ్రాయిడ్ 13పై పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.33,999 ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








