Nothing Laptop లు రాబోతున్నాయి! ధర, లాంచ్ వివరాలు
నథింగ్ కంపెనీ తన మొదటి ల్యాప్‌టాప్ పరికరాన్ని అతి త్వరలో విడుదల చేయనుందని పలు నివేదికలు తెలియచేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న నథింగ్ పోర్ట్‌ఫోలియోకి కొత్తగా జోడించబడే ఈ నథింగ్ ల్యాప్‌టాప్ (Nothing Laptop) గురించిన వివరాలను ఇక్కడ పరిశీలిద్దాం.
ప్రపంచవ్యాప్తంగా, బెస్ట్ ఇన్ క్లాస్ స్మార్ట్‌ఫోన్‌లు మరియు హెడ్‌సెట్‌లను అందించే ప్రముఖ సంస్థలలో నథింగ్ ఒకటి. నథింగ్ కంపెనీ తన కస్టమర్ల అవసరాలు ఒకదాని తర్వాత ఒకటిగా తీర్చడం పై ఆసక్తి చూపిస్తోంది. నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1) మరియు నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) దానికి స్పష్టమైన ఉదాహరణలు.

ఈ సంస్థ యొక్క స్మార్ట్‌ఫోన్ లను మిలియన్ల మంది అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు మరియు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా నథింగ్ కంపెనీ పారదర్శకమైన డిజైన్ ప్రపంచ స్మార్ట్ ఫోన్, ఇయర్ ఫోన్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం. ఇటీవలి అనేక నివేదికల ప్రకారం, నథింగ్ సీఈఓ కార్ల్ పీ త్వరలో సంస్థ ల్యాప్‌టాప్ మార్కెట్‌లోకి ప్రవేశించే సూచనలు ఉన్నట్లు తెలియచేసారు.
దీని కారణంగా, చాలా మంది నథింగ్ అభిమానులు, ఈ రాబోయే కొత్త నథింగ్ ల్యాప్‌టాప్ ఫీచర్లు మరియు ధరల కోసం ఇంటర్నెట్ లో ఎంతో ఉత్సాహంగా వెతుకుతున్నారు. CEO ప్రకటించిన ఈ చిన్న స్నిప్పెట్ ప్రకారం, కంపెనీ తన మొదటి ల్యాప్‌టాప్ పరికరాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు మాత్రమే అతను సూచించాడు. అయితే, దీనికి సంబందించిన అదనపు వివరాలు మరియు ఫీచర్ల గురించి అతను మరేమీ చెప్పలేదు.
సంస్థ యొక్క అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా ఈ ల్యాప్‌టాప్‌ల వివరాలు ఏవీ షేర్ చేయలేదు. ఇక పోతే డిజైన్ కు సంబంధించి అంచనా ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి, రాబోయే కొత్త నథింగ్ ల్యాప్‌టాప్ పరికరం ఈ ఫోటోలో ఉన్నట్లుగా కనిపించే అవకాశం ఉంది. కంపెనీ పోస్ట్‌లో ప్రచురించబడిన చిత్రాలలో నథింగ్ ల్యాప్‌టాప్ వెనుక ఉన్న బూడిద మరియు తెలుపు రంగులను మీరు స్పష్టంగా చూడవచ్చు.
అయితే, ఇది ఏ యే ఫీచర్లను కలిగి ఉంటుంది మరియు ఇది బడ్జెట్ ధరలో వస్తుందా?లేదా? ఈ ఏడాది లాంచ్ అవుతుందా? దాని విడుదల తేదీ ఎప్పుడు? వంటి సమాచారం ఇంకా వివరంగా తెలియదు. ప్రస్తుతానికి కంపెనీ నుండి నథింగ్ ల్యాప్‌టాప్ అనే కొత్త పరికరం రాబోతుందని మాత్రమే ధృవీకరించబడింది.
నథింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్ అయిన తర్వాత దాని వినియోగదారుల నుండి భారీ ప్రశంసలను పొందుతాయని మేము ఊహించవచ్చు. ఎందుకంటే నథింగ్ ఫోన్ 1 మరియు నథింగ్ ఫోన్ 2 వాటి గొప్ప డిజైన్‌లు మరియు ఫీచర్ల కోసం వాటి వినియోగదారుల నుండి ఎలా ప్రేమ మరియు ప్రశంసలను పొందాయో మనం ఇంతకు ముందు చూశాము. కంపెనీ తన పరికరాలను నిరంతరం ఎలా మెరుగుపరుస్తుందో కూడా మనము చూసాము.
నథింగ్ ల్యాప్‌టాప్‌ల ధర వివరాలు అధికారికంగా ఇంకా తెలియరాలేదు. కానీ, భారతీయ మార్కెట్లో ఇది రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా ఉంది. ఈ కొత్త నథింగ్ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వివరాలు అతి త్వరలో నథింగ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ రావొచ్చని అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications








