Home
News

నథింగ్‌ ఇయర్‌ బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌ ముందస్తు బుకింగ్‌ కోసం పాస్‌లు.. ప్రయోజనాలేంటి?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నథింగ్‌ సబ్‌బ్రాండ్ CMF నుంచి బడ్స్‌ ప్రో, వాచ్‌ ప్రో ప్రీ ఆర్డర్‌ కోసం పాస్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 26న ఈ ఉత్పత్తులు లాంచ్‌ కానుండగా.. ఒకరోజు ముందుగా అంటే 25న పాస్‌ను కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే పాస్‌ను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.

ఈ పాస్‌ సీఎంఎఫ్ ఉత్పత్తులకు మందస్తు యాక్సెస్‌ను అందిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ ప్రీ ఆర్డర్‌ పాస్‌తో బడ్స్‌ ప్రో, వాచ్‌ ప్రో, పవర్‌ 65W జెన్‌ అడాప్టర్‌ను రిజర్వ్‌ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. రూ.500 చెల్లించి ఈ పాస్‌ను కొనుగోలు చేసుకోవాలని, దీని ద్వారా రూ.1000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది.

Nothing smartwatch and earbuds

ఈ పాస్‌ను కొనుగోలు చేసిన వారు నథింగ్ లేదా సీఎంఎఫ్‌ ఉత్పత్తులపై అదనంగా రూ.500 వోచర్‌ను క్లెయిమ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ రెండు ఉత్పత్తులకు సాధారణ సేల్‌ ప్రారంభమయ్యే ముందే పాస్‌ కొనుగోలు చేయడం ద్వారా ముందస్తు యాక్సెస్‌ పొందుతారు. దీంతోపాటు వేగవంతమైన డెలివరీని కూడా పొందుతారని వెల్లడించింది.

బడ్స్‌ ప్రో 45dB యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ టెక్నాలజీని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. అలాగే స్మార్ట్‌వాచ్‌ ప్రో 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 1.96 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీర్ఘచతురస్ర డయల్‌ను కలిగి ఉంది. మరిన్ని ఫీచర్లు వెల్లడి కావాల్సి ఉంది.

ఇయర్‌ బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌, మింత్రా సహా విజయ్‌ సేల్స్‌ సహా ఇతర రిటైల్‌, ఆఫ్‌లైన్‌ దుకాణాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇటువంటి అనేక ఉత్పత్తులను మరిన్ని విడుదల చేయాలని సంస్థ భావిస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

* నథింగ్‌ సంస్థ జులైలో నథింగ్‌ ఫోన్‌2ను విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 SoCను కలిగి ఉంది. ఈ ఫోన్ 6.7 అంగుళాల HDR 10+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 OSపై పనిచేస్తుంది. 45W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 4700mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది.

నథింగ్‌ ఫోన్ 2 ప్రారంభ ధర రూ.44,999గా ఉంది. ఈ ఫోన్ ప్రీమియం గ్లాస్ బ్యాక్‌ డిజైన్‌, వెనుకవైపు కూల్‌ గ్లిఫ్‌ బ్యాక్‌లైట్‌ ఇంటర్‌ఫేస్‌ను పొందుతారు. దీంతోపాటు కొంచెం బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అధిక సూర్యకాంతిలో ఈ స్క్రీన్‌ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ ఫోన్‌ రీఫ్రెష్‌ రేట్‌ 10Hz నుంచి 120Hz మధ్య సర్దుబాటు చేయబడుతుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Nothing smartwatch and earbuds launch pre pass on sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X