Home
News

Nothing సబ్ బ్రాండ్ CMF ఫోన్ 1 ధర లీక్! బ్రాండ్ నుండి చీపెస్ట్ ఫోన్ ఇదే!

Nothing సంస్థ యొక్క సబ్ బ్రాండ్ అయిన CMF యొక్క CMF ఫోన్ 1 ధర భారతదేశంలో సోమవారం (జూన్ 10) టిప్‌స్టర్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో లీక్ చేయబడింది. లీక్ సమాచారం ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ బాక్స్ ధర సుమారు రూ. 20,000 కు దగ్గరగా ఉంటుందని సూచిస్తోంది. నథింగ్ యొక్క సబ్-బ్రాండ్ CMF ద్వారా రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 6న కంపెనీచే అధికారికంగా ధృవీకరించబడింది. అయితే, లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ అభివృద్ధి పై స్మార్ట్‌ఫోన్ చిప్‌సెట్ మరియు విస్తరించదగిన స్టోరేజీ గురించిన సమాచారాన్ని సూచించే మరొక లీక్ కూడా విడుదలైంది.

CMF ఫోన్ 1 యొక్క బాక్స్ ధర వివరాలు లీక్
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ X లో చేసిన పోస్ట్ ప్రకారం, భారత మార్కెట్లో CMF ఫోన్ 1 యొక్క బేస్ వేరియంట్ బాక్స్ ధర రూ. 19,999 గా ఉంటుంది. అయితే, బాక్స్‌పై పేర్కొన్నదాని కంటే వాస్తవ ధర కొంచెం తక్కువగానే ఉండవచ్చని మరో నివేదిక అంచనా వేస్తోంది. డిస్కౌంట్ లేకుండా, రూ.18,000 కి అమ్మకానికి రావొచ్చు. ఆఫర్ తగ్గింపులు దాని ధరను మరింత తగ్గించి రూ. 17,000 కి అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది.

Nothing Sub Brand CMF Phone 1 Box Price In Indian Market Leaked

లీక్ అయిన రూమర్లు నిజమైతే, ఇది CMF ఫోన్ 1ని భారతదేశంలో కార్ల్ పీ నేతృత్వంలోని స్టార్టప్ అందించే చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా వస్తుంది. నథింగ్ ఫోన్ 2a కంటే దాదాపు రూ. 4,000 తక్కువ తగ్గింపు ధర తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క రాబోయే కొత్త లాంచ్ కోసం మైక్రోసైట్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఇది దాని ఫీచర్లు లేదా ధర వంటి ప్రత్యేక స్పెసిఫికేషన్లు అందిస్తుంది.

CMF ఫోన్ 1 స్పెసిఫికేషన్‌ల వివరాలు
X పోస్ట్ లోని టిప్‌స్టర్ గాడ్జెట్ బిట్స్ లీక్ ప్రకారం, CMF ఫోన్ 1 మీడియా టెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్ ద్వారా వస్తుందని భావిస్తున్నారు. 2.5GHz వద్ద నాలుగు కోర్లతో కూడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు 2.0GHz వద్ద క్లాక్ చేయబడిన మరో నాలుగు కోర్లు ఉన్నాయి. టిప్‌స్టర్ టెక్ నెర్డ్_9 ఇది రెండు UFS 2.2 స్టోరేజ్ వేరియంట్‌లలో అందించబడుతుందని పేర్కొంది. 128GB మరియు 256GB స్టోరేజీ వేరియంట్ లలో వస్తుంది.

ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని అంచనా ఉంది. కెమెరా ఆప్టిక్స్ పరంగా, ఈ హ్యాండ్‌సెట్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్‌తో డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉండవచ్చు. ఇంకా, లీక్‌ల ప్రకారం, ఈ CMF ఫోన్ 1 , 5,000mAh బ్యాటరీతో 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Nothing Sub Brand CMF Phone 1 Box Price In Indian Market Leaked. Design And Specifications Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X