Home
News

Nothing నుంచి కొత్త ఫోన్ టీజర్ విడుదలైంది! ఇండియాలో లాంచ్ ఎప్పుడు?

Nothing సంస్థ భారతదేశంలో తమ కొత్త పరికరాన్ని లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది. కంపెనీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ కొత్త ఉత్పత్తిని ప్రారంభించడాన్ని టీజ్ చేసింది.ఈ కొత్త పరికరం ఏమిటనే విషయం మరియు దాని పేరును ఏదీ పేర్కొనలేదు, ఏది ఏమైనా కంపెనీ నుంచి వచ్చే తర్వాతి పరికరం ఇదే అవ్వొచ్చు అనే దాని గురించి ఇంటర్నెట్‌లో లీక్ లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇది నథింగ్ ఫోన్ 3 లేదా CMF ఫోన్ (1) కావచ్చని చెబుతున్నారు, అయితే, ఆ పరికరం ఏది? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నథింగ్ సంస్థ తన X ఖాతా ద్వారా షేర్ చేయబడిన టీజర్ ఫోటో ప్రకారం, 3 సంఖ్యలు - 3,2,1 మినహా ఈ పరికరం గురించి ఎక్కువగా ఎమీ చర్చించలేదు. ఈ ఫోటో పరికరం గురించి వెల్లడించకపోయినా, కంపెనీ యొక్క, ఇటీవల పరికరాలను రిఫ్రెష్ చేసినందున ఇది ఆడియో ఉత్పత్తి కాదని అంచనా వేయవచ్చు.

Nothing Teases Its New Phone Launch

అంటే, నథింగ్ సహ వ్యవస్థాపకుడు అకిస్ ఎవాంజెలిడిస్ టీజర్‌ ట్వీట్ ప్రకారం, ఈ పరికరం ఒక ఫోన్ అని చెప్పారు. అంటే, కొత్త నథింగ్ ఫోన్ రాబోతోందని స్పష్టమవుతోంది.

ఇప్పుడు, నథింగ్ ఫోన్ 3 మరియు CMF ఫోన్ (1) గురించి కూడా లీక్‌లు వచ్చాయి, ఇందులో ఏ ఫోన్ వస్తుందో తెలియక ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఆసక్తికరంగా, ఈ రెండు ఫోన్‌లు కూడా జూలైలో లాంచ్ చేయబడతాయని తెలుస్తోంది. అయితే రెండు పరికరాలు రానున్నాయని కంపెనీ అధికారికంగా ఎటువంటి సూచనలు ఇవ్వలేదు.

ఇప్పుడు, "3,2,1" టీజర్ బ్రాండ్ నుండి మూడవ తరం నథింగ్ ఫోన్ కావచ్చని ఎక్కువ అంచనాలున్నాయి. ఎందుకంటే గత రెండు వెర్షన్‌లు ఇప్పటికే ప్రకటించబడ్డాయి. ఈ ఫోన్ 2 జూలై 2023 లో ప్రవేశపెట్టబడింది, కాబట్టి ఇది నథింగ్ ఫోన్ 3 అయ్యే అవకాశం ఉంది.

కానీ, అసలు నథింగ్ ఫోన్ సిరీస్ మనం నథింగ్ ఫోన్ మరియు ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్‌లలో చూసిన సెమీ-ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. విడుదలైన టీజర్ ఫోటో వెనుక భాగంలో మాట్ ఫినిషింగ్ తో కొత్త ఆల్-బ్లాక్ లుక్‌ను చూపుతుంది. ఇది CMF ఫోన్ (1) కోసం కావచ్చు ఎందుకంటే నథింగ్ ఫోన్ 2a , ఫోన్ 2 యొక్క టోన్-డౌన్ వెర్షన్ గా లాంచ్ చేయబడుతోంది.

నథింగ్ ఫోన్ 3 కోసం ఈ కొత్త డిజైన్ వినియోగదారులకు రిఫ్రెష్ రూపాన్ని అందించే అవకాశం ఉంది. అలాగే, ఈ కొత్త ఫోన్ పూర్తిగా నలుపు రంగులో ఉంటే, కంపెనీ డిజైన్‌తో ఎక్కువ ప్రయోగాలు చేయడం లేదని మరియు ప్రీమియం మోడల్‌ల కోసం ప్రత్యేకమైన డిజైన్ ను రిజర్వ్ చేయడం లేదని దీని అర్థం. వెనుక భాగంలో ఒక స్క్రూ కూడా ఉంది, ఇది పరికరంలో తొలగించగల వెనుక ప్యానెల్‌ను కలిగి ఉండవచ్చని సూచిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్‌కు ముందు కంపెనీ ఉత్పత్తి గురించి మరిన్నింటిని వెల్లడించే అవకాశం ఉన్నందున రాబోయే రోజుల్లో దీనిపై మంచి స్పష్టత వస్తుంది.

CMF ఫోన్ (1) లాంచ్ అయినట్లయితే, దాని ధర సుమారు రూ. 20,000 ఉంటుందని అంచనా. నథింగ్ ఫోన్ 3 భారతదేశంలో రూ. 40,000 నుండి రూ. 45,000 మధ్య ఉండవచ్చని గతంలో సూచించబడింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Nothing Teases Its New Phone Launch. Is It Nothing Phone 3 or CMF Phone 1? Complete Leaked Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X