ఈ రోజు లోపు బ్యాక్ అప్ చేసుకోకపోతే మీ వాట్సాప్ డేటా గల్లంతే

మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ డేటాను బ్యాక్ అప్ చేసుకోలేదా అయితే వెంటనే బ్యాక్ అప్ చేసుకోండి లేకపోతే మీరు గతంలో తీసిన బ్యాక్ అప్ అంతా నవంబర్ 12 తర్వాత శాశ్వతంగా డిలీట్ అయిపోతుందని వాట్సాప్ తెలిపింది.

|

మీ ఫోన్ లో ఉన్న వాట్సాప్ డేటాను బ్యాక్ అప్ చేసుకోలేదా అయితే వెంటనే బ్యాక్ అప్ చేసుకోండి లేకపోతే మీరు గతంలో తీసిన బ్యాక్ అప్ అంతా నవంబర్ 12 తర్వాత శాశ్వతంగా డిలీట్ అయిపోతుందని వాట్సాప్ తెలిపింది.కాగా 12 నెలల్లో ఒక్కసారి కూడా బ్యాకప్ చేయకుంటే అంతకు ముందు చేసిన బ్యాకప్ అంతా గూగుల్ డ్రైవ్ స్టోరేజీ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోతుందని వాట్సాప్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్ లోకి ఎలా బ్యాక్ అప్ చేసుకోవాలో మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి.

OnePlus 6Tలో 4వ సీక్రెట్ కెమెరా, సంచలన విషయం వెలుగులోకి..OnePlus 6Tలో 4వ సీక్రెట్ కెమెరా, సంచలన విషయం వెలుగులోకి..

ట్రిక్ 1

ట్రిక్ 1

ఆండ్రాయిడ్ వినియోగదారులు ముందుగా వారి మొబైల్ లో ఉన్న వాట్సప్ యాప్ ని ఓపెన్ చేయాలి.

ట్రిక్ 2

ట్రిక్ 2

పైన ఉన్న మెనూని క్లిక్ చేయాలి. అక్కడ మీకు సెట్టింగ్స్ కనపడుతుంది.

ట్రిక్ 3

ట్రిక్ 3

ఈ సెట్టింగ్స్ ని ఓపెన్ చేయాలి. అక్కడ చాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే బ్యాకప్‌ ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేయండి

ట్రిక్ 4

ట్రిక్ 4

చాట్‌ హిస్టరీని సేవ్‌ చేయాలనుకున్న గూగుల్‌ అకౌంట్‌ని సెలక్ట్‌ చేసుకోండి, వీడియోలు కూడా బ్యాకప్‌ కావాలనుకుంటే అవి కూడా సెలక్ట్ చేసుకోండి.

ట్రిక్ 5

ట్రిక్ 5

బ్యాకప్‌ నొక్కితే మీ వాట్సప్‌లోని డేటా మొత్తం గూగుల్‌ డ్రైవ్‌ లో స్టోర్‌ అవుతుంది. వాట్సప్‌ డేటా బ్యాకప్‌ రెగ్యులర్‌గా చేసుకోవాలనుకుంటే అక్కడే అప్షన్స్‌(డెయిలీ, వీక్లీ, మంథ్లీ) కూడా ఉంటాయి

గూగుల్‌ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు...

గూగుల్‌ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు...

ఒక్కో అకౌంట్‌కు గూగుల్‌ డ్రైవ్‌లో 15 జీబీ డేటా ఉచితంగా వినియోగించుకోవచ్చు.వాట్సాప్‌ బ్యాకప్‌కి గుగుల్‌ డ్రైవ్‌లోని స్టోరేజీని వాడకుండా, ప్రత్యేకంగా వాట్సప్‌ డేటా స్టోర్‌ అవుతుంది.

విండోస్ ఫోన్ యూజర్లు ఎలా చేయాలంటే ?

విండోస్ ఫోన్ యూజర్లు ఎలా చేయాలంటే ?

విండోస్ ఫోన్ యూజర్లు కూడా తమ వాట్సాప్ చాట్ హిస్టరీని మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ లో చాలా సులభంగా సేవ్ చేసుకోవచ్చు

-అయితే ఈ ఫీచర్ విండోస్ 8.1 ఆ తరువాత వచ్చిన ఫోన్లకు మాత్రమే ఈ పని చేస్తుంది. అంతే కాకుండా ఈ ఫోన్ కు వన్ డ్రైవ్ సైన్ ఇన్ అయి ఉండాలి

- వాట్సాప్ ఓపెన్ చేసి more అనే ఆప్షన్ క్లిక్ చేసి icon > settings > chats and calls > backupలోకి వెళ్ళాలి . మీకు కావాల్సిన వీడియోల కూడా బ్యాక్ అప్ తీయాలో లేదో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ అప్ ఎన్నాళ్లకు ఒకసారి తీయాలని ఫ్రీక్వెన్సీ,వైఫై లేదా మొబైల్ డేటా ద్వారా బ్యాక్ అప్ తీయాలా అనే ఆప్షన్లు సెలెక్ట్ చేసుకోవాలి.

- ఒకవేళ మ్యానువల్ గా బ్యాక్ అప్ తీసుకోవాలంటే more ఆప్షన్ క్లిక్ చేసి icon > settings > chats and calls > backupలోకి వెళ్ళాలి అప్పుడు మీ డేటా ఫోన్ ఇంటర్నల్ మెమరీ లో స్టోర్ అవుతుంది. కావాలంటే అక్కడి నుంచి వన్ డ్రైవ్ కు పంపుకోవచ్చు.

 

Best Mobiles in India

English summary
November 12 is the deadline for whatsapp data backup.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X