ఇంటర్నెట్ లేకున్నా మొబైల్‌లో ఫేస్‌బుక్‌ త్వరలో సేవలు ప్రారంభం

Posted By: Staff

ఇంటర్నెట్  లేకున్నా మొబైల్‌లో ఫేస్‌బుక్‌ త్వరలో సేవలు ప్రారంభం

డేటా కనెక్షన్‌ కోసం చెల్లింపు జరపకుండానే అన్ని రకాల హ్యాండ్‌సెట్స్‌లోనూ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌ 'ఫేస్‌బుక్‌'ను ఏక్సెస్‌ చేసుకొనేందుకు తోడ్పడే ఒక కొత్త అప్లికేషన్‌ వచ్చేసింది.. సింగపూర్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ డెవలపర్‌ U2opia Mobile ఈ సేవను అభివృద్ధి చేసింది. యుటోపియా మొబైల్‌ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సుమేశ్‌ మీనన్‌ మాట్లాడుతూ, 'మేం యూఎస్‌ఎస్‌డీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం, ఇది యూజర్లకు వారి ఫోన్‌లకు జీపీఆర్‌ఎస్‌ కనెక్షన్‌ లేకున్నా ఫేస్‌బుక్‌కు అనుసంధానం అయ్యేందుకు సహకరిస్తుంద'న్నారు.

యూఎస్‌ఎస్‌డీ అంటే అన్‌స్ట్రక్చర్డ్‌ సప్లిమెంటరీ డేటాకు పొట్టి పేరు. దీని ద్వారా గ్రాఫిక్స్‌ను పొందే వీలు లేకపోయినా, ఇది యూజర్లకు వారి స్నేహితుల ఫేస్‌బుక్‌ వాల్స్‌కు అప్‌డేట్‌లను పంపడానికి, లేదా అటువంటి అప్‌డేట్‌లను తాము చూడటానికి తోడ్పడుతుందని మీనన్‌ వివరించారు. ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌తో కలసి యుటోపియా, ఈ అప్లికేషన్‌ను మంగళవారం ప్రారంభించింది. ఎయిర్‌టెల్‌ కస్టమర్లు వారి ఫేస్‌బుక్‌ స్టేటస్‌ను ఈ సౌకర్యం ద్వారా ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

పూర్తి ఫీచర్‌ అప్లికేషన్‌లు పొందాలంటే మాత్రం రోజుకు రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్‌ యూజర్లు డేటా ప్లాన్‌లకు చందా కట్టకుండానే నాన్‌- క్వెర్టీ మొబైల్‌ సెట్‌లపై ఫేస్‌బుక్‌ అందుబాటు (ఏక్సెస్‌) కోసం *325#మరియు *fbk#కు డయాల్‌ చేయవచ్చని భారతీ ఎయిర్‌టెల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot