వెబ్ వర్షన్‌ను విడుదల చేసిన వాట్స్‌యాప్

వాట్స్‌యాప్ తమ యాప్‌కు సంబంధించి ‘వాట్స్‌యాప్ వెబ్' పేరుతో డెస్క్‌టాప్ క్లెయింట్ సర్వీసును విడుదల చేసింది. ఈ వెబ్ ఆధారిత సర్వీసును పొందాలనుకునే వారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా web.whatsapp.comలోకి లాగినై తమ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునట్లయితే డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది. దీంతో యాజర్ తన ఫోన్‌కు వచ్చిన వాట్స్‌యాప్ సంభాషణలు ఇంకా సందేశాలను కంప్యూటర్‌లో చూసుకోవచ్చు.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలంటే యూజర్ ఫోన్ ఎల్లప్పుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి. వాట్స్‌యాప్ ప్రవేశపెట్టిన ఈ వెబ్ ఆధారిత సర్వీసును ప్రస్తుతం ఐఓఎస్ డివైస్‌లు సపోర్ట్ చేయలేక పోతోన్నాయి. ఇందుకు కారణం యాపిల్ ప్లాట్‌ఫామ్ విధించిన పరిమితులే. ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, బ్లాక్‌బెర్రీ, నోకియా ఎస్60 డివైస్‌ల ద్వారా వాట్స్‌యాప్ వెబ్ సర్వీసును యాక్సెస్ చేసుకోవచ్చు.
70 కోట్ల యూజర్లతో

‘వాట్స్‌యాప్'ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే వారి సంఖ్య 70 కోట్లకు చేరకుంది. స్మార్ట్‌ఫోన్స్ ఇంకా టాబ్లెట్ పీసీల ద్వారా సలువుగా మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకునేందుకు వీలుకల్పిస్తున్న వాట్స్ యాప్ అనతికాలంలోనే విశేష ప్రాచుర్యాన్ని సంపాదించుకోవటం విశేషం.
వాట్స్‌యాప్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ గతేడాది ఫిబ్రవరిలో 18 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 2014, ఆగష్ట్ నాటికి వాట్స్‌యాప్ వినియోగదారుల సంఖ్య 60 కోట్లు ఉండగా 4 నెలల వ్యవధిలోనే 10 కోట్ల మంది అదనంగా చేరడం గొప్ప విషయమని వాట్స్‌యాప్ సీఈఓ జాన్ కౌమ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. వాట్స్‌యాప్ ద్వారా రోజుకు సగటున 3 వేల కోట్ల సందేశాలను షేర్ చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








