ప్రశాంతమైన ధ్యానం కోసం ‘Meditate Peacefully’ యాప్

Posted By:

ప్రశాంతమైన ధ్యానాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా ఫోన్ కాల్ మోగితే ఏమవుతుంది..? మానిసిక ప్రశాంతత కోసం అప్పటి వరకు మీరు చేస్తున్న మెడిటేషన్ కాస్తా వృథా అయిపోతుంది. ముఖ్యమైన కాల్స్ మిస్సై పోతామన్న ఆందోళణతో పలవురు మెడిటేషన్ చేసుకుంటున్న సమయాల్లోనూ తమ స్మార్ట్‌ఫోన్‌లను సైలెంట్ మోడ్‌లలో ఉంచేందుకు ఇష్టపడటం లేదు.

ప్రశాంతమైన ధ్యానం కోసం ‘Meditate Peacefully’ యాప్

ఈ సమస్యకు సరికొత్త పరిష్కారాన్ని చూపుతూ ‘‘Meditate peacefully'' అనే ఉచిత అప్లికేషన్ అందుబాటులోకి వచ్చేసింది. ఈ యాప్‌లో మీ మెడిటేషన్‌కు సంబంధించిన టైమ్ డ్యురేషన్‌ను సెట్ చేసుకుని స్టార్ట్ బటన్ పై క్లిక్ చేస్తే చాలు, యాప్ ఆటోమెటిక్‌గా మీ ఫోన్‌‌ను సైలెంట్ మోడ్‌‌లోకి తీసుకువెళుతుంది.

ప్రశాంతమైన ధ్యానం కోసం ‘Meditate Peacefully’ యాప్

ఈ మెడిటేషన్ సమయంలో ఎవరైనా మీకు కాల్స్ చేస్తున్నట్లయితే, మీ ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నట్లు వారికి ఎస్ఎంఎస్‌ల ద్వారా యాప్ తెలియపరుస్తుంది. ఒకవేళ కాల్ ముఖ్యమైనది అయితే URGENT అని రిప్లై ఇవ్వమంటూ సదరు ఎస్ఎంఎస్ ద్వారా వారిని కోరుతుంది. రిప్లై అందిన వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది.

ప్రశాంతమైన ధ్యానం కోసం ‘Meditate Peacefully’ యాప్

ఈ యాప్ ద్వారా మీ మెడిటేషన్ ప్రక్రియను ఏ విధమైన అంతరాయాలు లేకుండా పూర్తి చేయవచ్చు. మీరు సెట్ చేసుకున్న టైమ్ పూర్తి అవగానే యాప్ ఆటోమెటిక్‌గా స్విచాఫ్ అయిపోతుంది. దీంతో మీ ఫోన్ సైలెండ్ మోడ్ నుంచి సాధారణ మోడ్‌లోకి వచ్చేస్తుంది. ఈ యాప్ ద్వారా మీ మెడిటేషన్‌కు సంబంధించి ఉదయం, సాయంత్రం రిమైండర్‌లను  సెట్ చేసుకోవచ్చు.

www.MeditatePeacefully.comలోకి లాగినై ‘‘Meditate peacefully'' యాప్‌ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Akmin టెక్నాలజీస్ గురించి...

‘‘Meditate peacefully'' యాప్‌ను Akmin టెక్నాలజీస్ అభివృద్థి చేసింది. Akmin సంస్థ 1998 నుంచి ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లను అందిస్తోంది. 45 దేశాల్లో ఉన్న ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్‌లతో పాటు సర్వీస్ ప్రొవైడర్లు Akmin సేవలను వినియోగించుకుంటున్నారు. మొబైల్ యాప్స్‌ను సైతం ఈ సంస్థ అభివృద్థి చేస్తోంది. Akmin అందిస్తోన్న ప్రొడక్ట్స్ ఇంకా సర్వీసులను 5 కోట్ల మంది పైగా వినియోగించుకుంటున్నారు. పూర్తి వివరాలకు www.akmin.comలోకి లాగిన్ కావొచ్చు.

English summary
Now an app to Meditate Peacefully!. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot