మొబైల్‌లో ఎయిరిండియా టిక్కెట్లు బుకింగ్..

Posted By: Super

మొబైల్‌లో ఎయిరిండియా టిక్కెట్లు బుకింగ్..

 

ముంబై: భారత దేశీయ మరియు అంతర్జాతీయ విమాన ఆపరేటరైన ఎయిరిండియా ప్రయాణీకులకు టిక్కెట్లను వారి యొక్క మొబైల్ ఫోన్స్ నుండి టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ప్రయాణీకులు అందుబాటులో మొబైల్ బుకింగ్ సౌకర్యం చేయడానికి గాను భారతదేశం ఆధారిత మొబైల్ వాణిజ్య సర్వీస్ ప్రొవైడర్ ఎన్‌జీపే అనే సాప్ట్ వేర్‌ని వినియోగదారులు వారి మొబైల్‌లో డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

మొబైల్‌లో ఎయిరిండియా టిక్కెట్లు బుకింగ్..

జీపీఆర్ఎస్ సౌకర్యం ఉన్న ఫోన్ వినియోగదారులు ఈ సాప్ట్ వేర్‌ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని, దీనితో పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ లకు ఈ సర్వీసు లభ్యమవుతుందని ఎయిరిండియా ప్రతనిధి తెలియజేశారు.

టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు గాను మొబైల్ వాణిజ్య సర్వీస్ ప్రొవైడర్ ఎన్‌జీపే కేవలం ఓ సర్వీసుగా పని చేస్తుందని క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాకింగ్ ద్వారానే టికెట్ ధరను చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ సర్వీసుని ప్రవేశపెట్టడానికి గల కారణం ఇంటర్నెట్ అందుబాటులో లేని పట్టణాల్లో ప్రయాణీకులు మొబైల్ ద్వారా వారి టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot