ఒక్క ఫోన్‌కాల్‌తో రైలు టికెట్ రద్దు: అదే రోజు డబ్బులు

Written By:

ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో మీ రైల్ టిక్కెట్ రద్దు కానుంది. మీరు అత్యవసర సమయంలో మీ ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వచ్చినప్పుడు మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ఇక నుంచి చాలా సులభతరం కానుంది. ఈ సదుపాయాన్ని ఏప్రిల్ రెండో వారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

Read more : ఇక మొబైల్ ఫోన్‌లో రైల్వే టికెట్ బుకింగ్

ఒక్క ఫోన్‌కాల్‌తో రైలు టికెట్ రద్దు: అదే రోజు డబ్బులు

వారు తెలిపిన వివరాల ప్రకారం మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నప్పుడు 139 కి ఫోన్ చేసి టికెట్ వివరాలను చెబితే సరిపోతుంది. వారికి వివరాలు చెప్పగానే మీ మొబైల్‌కి వన్ టైం పాస్ట్‌వర్డ్ వస్తుంది. అదే రోజు మీరు సమీప రిజర్వేషన్ కౌంటర్ కెళ్లి మీ వన్ టైం పాస్‌వర్డ్‌ని చెప్పి టికెట్ కు సంబంధించిన డబ్బులను పొందవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లను ఆన్‌లైన్‌ టికెట్ వెబ్‌సైట్‌లోనే రద్దు చేసుకోవచ్చని కూడా తెలిపారు.

Read more: అంతుచిక్కని ఇండియా మిస్టరీలు

ఒక్క ఫోన్‌కాల్‌తో రైలు టికెట్ రద్దు: అదే రోజు డబ్బులు

139 నంబర్ కేవలం కౌంటర్ల వద్ద టికెట్లను రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమేనని వారు తెలిపారు. రైలు బయలుదేరటానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (IRCTC website) ఇంతకుముందు కల్పించిన విషయం విదితమే. ఈ సంధర్భంగా మీ IRCTC టికెట్ బుకింగ్ మరింత సౌకర్యవంతంగా జరగాలంటే ఎలానో తెలుసుకుందాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Ticketdate అనే వెబ్‌సైట్ ద్వారా

1

Ticketdate అనే వెబ్‌సైట్ ద్వారా మీ ప్రయాణానికి సంబంధించి ముందస్తు బుకింగ్‌ల వివరాలను మరంత వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు.

 

 

మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే..?

2

మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే..? Trainman అనే వెబ్‌సైట్, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న మీ టికెట్‌కు సంబంధించి ఫైనల్ స్టేటస్‌ను ముందుగానే చేప్పేస్తుంది. దాన్ని బట్టి ప్రత్యామ్నాయా మార్గాలను ఆలోచించుకోవచచ్చు

 

 

Indianrail.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా

3

Indianrail.gov.in అనే వెబ్‌సైట్ ద్వారా స్టేషన్ కోడ్స్, షెడ్యూల్స్ ఇంకా రూట్లకు సంబంధించి వివరాలను తెలుసుకోవచ్చు.

 

 

Magic autofill for irctc అనే ఫీచర్ సాయంతో

4

Magic autofill for irctc అనే ఫీచర్ సాయంతో తత్కాల్ టికెట్ లను వేగవంతంగా బుక్ చేసుకోవచ్చు.

 

 

బుక్‌మై ట్రెయిన్ యాప్ ద్వారా

5

బుక్‌మై ట్రెయిన్ యాప్ ద్వారా క్యాష్ ఆన్ డెలివరీ పై టికెట్లను బక్ చేసుకోవచ్చు.

 

 

మీ ట్రెయిన్ టికెట్‌ను ఫ్లైట్ టికెట్‌గా మార్చుకునే అవకాశాన్ని

6

వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నట్లయితే మీ ట్రెయిన్ టికెట్‌ను ఫ్లైట్ టికెట్‌గా మార్చుకునే అవకాశాన్ని ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. తక్కువ ధర విమాన ఆపరేటర్లతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఐఆర్‌సీటీసీ ఈ సేవలను అందిస్తోంది.

 

 

railyatri.in అనే లైవ్ ట్రెయిన్ స్టేషన్ ఫీచర్ ద్వారా

7

railyatri.in అనే లైవ్ ట్రెయిన్ స్టేషన్ ఫీచర్ ద్వారా మీరు ఎక్కాల్సిన ట్రెయిన్‌ను రియల్ టైమ్ అనుభూతులతో ట్రాక్ చేయవచ్చు.

 

 

ప్రయాణంలో మీకు కావల్సిన ఆహారాన్ని

8

Travel Khana, ప్రయాణంలో మీకు కావల్సిన ఆహారాన్ని సరఫరా చేస్తుంది.

 

 

సమీపంలోని రైల్వే స్టేషన్ ల వివరాలను

9

indianrail.gov.in ద్వారా సమీపంలోని రైల్వే స్టేషన్ ల వివరాలను తెలుసుకోవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Now, cancelling train tickets will be just a phone call away
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting