డేటింగ్ కోసం ఆరాటపడుతున్నారా.. ఐతే ట్రై చేయండి

Posted By: Super

డేటింగ్ కోసం ఆరాటపడుతున్నారా.. ఐతే ట్రై చేయండి

యువత కోసం డేట్‌దోస్తీడాట్‌కామ్ అనే డేటింగ్, ఫ్రెండ్‌షిప్ సైట్ ప్రారంభమైంది. మిగతా సైట్లకు భిన్నమైన రీతిలో.. ప్రత్యేకంగా యువతుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చేలా దీన్ని రూపొందించినట్లు వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు అర్జున్ సాహ్నీ తెలిపారు.

సమస్యాత్మకమైన అపరిచిత వ్యక్తుల నుంచి యువతులకు ఇబ్బందులు ఎదురవకుండా ఈ సైట్‌లో తగు జాగ్రత్తలు పొందుపర్చినట్లు ఆయన వివరించారు. అలాగే, ఇన్‌స్టంట్ చాట్, డేటింగ్, జోక్ కార్నర్, లవ్ హారోస్కోప్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయని సాహ్నీ పేర్కొన్నారు. త్వరలోనే మొబైల్ అప్లికేషన్ కూడా జోడించనున్నట్లు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot