‘*99#’తో బ్యాంక్ అకౌంట్ వివరాలు! (ఏ ఫోన్ నుంచైనా)

Posted By: Super

‘*99#’తో  బ్యాంక్ అకౌంట్ వివరాలు! (ఏ ఫోన్ నుంచైనా)

 

ముంబై: జస్ట్! ఒక ఫోన్ కాల్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సర్వీస్ ద్వారా *99# అనే నంబర్‌కు డయల్ చేసి బ్యాంక్ సర్వీసులను పొందవచ్చు.  ఈ నెంబర్ ను ఉపయోగించి  ఏ మొబైల్ నుంచైనా, ఏ బ్యాంక్ సర్వీస్‌నైనా పొందవచ్చు. సమ్మిళిత ఆర్థిక వృద్ధిలో భాగంగా లభ్యం కానున్న ఈ సౌకర్యాన్ని గత శనివారం పుణేలో జరిగిన జాతీయ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్‌లో ఆర్థిక మంత్రి పి.చిదంబరం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసును నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అందిస్తోంది.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌తోనే మొబైల్ బ్యాంకింగ్ సేవలు లభ్యమవుతున్నాయని, ఏ సాధారణ మొబైల్ హ్యాండ్‌సెట్‌తోనైనా బ్యాంకింగ్ సేవలు పొందేలా అప్లికేషన్‌ను రూపొందించామని ఎన్‌పీసీఐ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏ.పి. హోతా తెలిపారు, ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ల్లో 23 బ్యాంకులకు సంబంధించిన సేవలు పొందవచ్చని వివరించారు. దేశంలో 14 మొబైల్ కంపెనీలున్నాయని, ఈ నెట్‌వర్క్‌లకు కూడా ఈ సర్వీసులను విస్తరించడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot