బ్లాక్‌బెర్రీ మెసెంజర్ ద్వారా ఫేస్‌బుక్, ట్విట్టర్

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ మెసెంజర్ ద్వారా ఫేస్‌బుక్, ట్విట్టర్

 

ప్రముఖ బ్లాక్ బెర్రీ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ తమయొక్క కస్టమర్స్‌ని దృష్టిలో పెట్టుకోని బ్లాక్ బెర్రీ మెసెంజర్(బిబిఎమ్) ద్వారా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, ట్విట్టర్ లకు కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా బ్లాక్ బెర్రీ మొబైల్స్‌ని ఉపయోగించే యూజర్స్ ఓ సరిక్రొత్త అనుభూతిని పొందనున్నారు. బ్లాక్ బెర్రీ కొత్తగా రూపొందించిన బ్లాక్ బెర్రీ 3.0 అప్లికేషన్ ద్వారా ఇది సాధ్యమవుతుందని బ్లాక్ బెర్రీ తయారీదారులు తెలిపారు. బ్లాక్ బెర్రీ మెసెంజర్‌లో ఈ సౌకర్యాన్ని కల్పించడం వల్ల యూజర్స్ ఈజీగా సోషల్ మీడియాకు కనెక్ట్ అవ్వోచ్చు.

గతంలో బ్లాక్ బెర్రీ మెసెంజర్ మ్యూజిక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్కెట్లో ఎప్పటికప్పడు కొత్త టెక్నాలజీ వస్తుండడంతో బ్లాక్ బెర్రీ తయారీదారు రీసెర్చ్ ఇన్ మోషన్ కూడా బ్లాక్ బెర్రీ మెసెంజర్ 3.0 అప్లికేషన్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఈ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు ఫేస్ బుక్, ట్విట్టర్‌లో ఉన్న సమాచారాన్ని బ్లాక్ బెర్రీ మెసెంజర్ వ్యక్తులతో షేర్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం బ్లాక్ బెర్రీ మెసెంజర్ అప్లికేషన్స్ బీటా వర్షన్‌తో పాటు అప్ గ్రేడ్ వర్సన్‌ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఎవరైతే యూజర్స్ బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్స్‌ని ఉపయోగిస్తున్నారో వారికి ఉచితంగా బ్లాక్ బెర్రీ అప్లికేషన్స్‌ని డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot