రూ.130కే 100 టీవీ చానల్స్

వినియోగదారులు ఇక పై రూ.130 చెల్లించి 100 టీవీ చానళ్లను పొందవచ్చు. ఈ మొత్తానికి పన్నులు ఇంకా వ్యాట్ అదనం. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డిస్ట్రీబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ టారిఫ్ ఫ్రీ చానల్స్‌కు మాత్రమే వర్తిస్తుందని ట్రాయ్ వివరించింది.

రూ.130కే 100 టీవీ చానల్స్

నోకియా లక్ష రూపాయుల ఫోన్ ఇదే

ఒకవేళ పెయిడ్ చానల్స్ కావాలనుకున్నట్లయితే ఆ చార్జీలను వినియోగదారుడే భరించాలని ట్రాయ్ కోరింది. 100 చానల్స్ దాటితే ప్రతి 25 చానల్స్‌కు రూ.20 చొప్పున వసూలు చేయాలని డిస్ట్రీబ్యూటర్లకు ట్రాయ్ సూచించింది.

రూ.130కే 100 టీవీ చానల్స్

మీ ఫోన్ నుంచి హీటింగ్ వస్తుందా..?

ఇక పై ప్రతి డిస్ట్రీబ్యూటర్ ఫ్రీగా ఇస్తోన్న చానళ్ల రుసుము, పే చానళ్ల రుసుమును తప్పనిసరిగా ప్రకటించి, అన్ని చానల్స్‌ను ప్యాకేజీల క్రింద అందించాలని కోరింది. ఈ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలను కూడా ఏనెలకు ఆనెల ప్రకటించాల్సి ఉంది. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న ప్యాకేజీని మార్చాలంటే తప్సనిసరిగా వారి నుంచి అనుమతి తీసుకోవల్సిందేనని ట్రాయ్ స్పష్టం చేసింది.

English summary
Now get 100 SD channels at Rs 130 per months, says TRAI. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot