Home
News

ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందడమెలా ?

దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ ఈ మధ్యనే పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించిన సంగతి అందరికీ తెలిసిందే.

దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ ఈ మధ్యనే పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించిన సంగతి అందరికీ తెలిసిందే. యూజర్లు రూ.499 ప్లాన్ వేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ ని పొందవచ్చు. అయితే ఇప్పుడు అదే ఊపులో యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ ప్లాన్లో కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు రెడీ అయింది. యూజర్లు రూ.399 ప్లాన్ ద్వారా ఈ ఉచిత ఆఫర్ పొందవచ్చు. వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్ తరహాలోనే ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అదనపు డేటా బెనిఫిట్స్‌తో పాటు రూ.999 విలువ గల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారుల కోసం ప్రకటించింది.

రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే...

రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే...

అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే నెలకు 40జీబీ హైస్పీడ్ 3జీ/4జీ డేటా పొందడంతో పాటు 200జీబీ వరకు డేటా కూడా రోల్‌ఓవర్ అవుతుంది.

 

 

ఎయిర్‌టీవీ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌ను...

ఎయిర్‌టీవీ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌ను...

అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్‌లతో పాటు ఎయిర్‌టీవీ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌ను ఎయిర్‌టెల్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. చివరగా సబ్‌స్ర్కైబర్లు రూ.51 విలువ గల అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్‌ను కూడా పొందుతారు.

బిల్లులపై రూ.50 డిస్కౌంట్....

బిల్లులపై రూ.50 డిస్కౌంట్....

తొలి ఆరు నెలల పాటు చెల్లించే బిల్లులపై రూ.50 డిస్కౌంట్ కూడా ఇస్తోంది. దీంతో ఈ ప్లాన్‌లో భాగంగా చెల్లించే మొత్తం కేవలం 349 రూపాయలు మాత్రమేనని సంస్థ వెల్లడించింది.

రూ.99 ప్లాన్...

రూ.99 ప్లాన్...

కాగా ఎయిర్‌టెల్ ఈ మధ్య రూ.99 ప్లాన్ ని రివిజన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వరకు ఈ ప్లాన్‌కు గాను 1జీబీ డేటా వచ్చేది. కానీ ఇకపై 2జీబీ డేటా లభిస్తుంది. ఇక అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి.

జియో రూ.98 ప్లాన్‌...

జియో రూ.98 ప్లాన్‌...

అదే జియోలో అయితే రూ.98 ప్లాన్‌కు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. కనుకనే జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో మార్పు చేసింది. ఇక ఈ రెండు సంస్థలు అందిస్తున్న ఈ ప్లాన్ల వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

బీఎస్‌ఎన్‌లో డేటా సునామీ ఆఫర్ కింద రూ.98....

బీఎస్‌ఎన్‌లో డేటా సునామీ ఆఫర్ కింద రూ.98....

మరో వైపు బీఎస్‌ఎన్‌లో డేటా సునామీ ఆఫర్ కింద రూ.98 కి రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 26 రోజులు ఉండగా ఇందులో ఎలాంటి కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు రావు. కేవలం మొబైల్ డేటా మాత్రమే వస్తుంది.

రూ.98 ప్లాన్లలో అన్నింటికన్నా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న డేటాయే ఎక్కువ....

రూ.98 ప్లాన్లలో అన్నింటికన్నా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న డేటాయే ఎక్కువ....

అయినప్పటికీ రూ.98 ప్లాన్లలో అన్నింటికన్నా బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తున్న డేటాయే ఎక్కువ కావడం విశేషం. ఇందులో 26 రోజులకు గాను రోజుకు 1.5 జీబీ డేటా చొప్పున మొత్తం 39 జీబీ డేటా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Now get Amazon Prime membership with this entry-level Airtel plan more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X