మూడు రోజుల్లో పాస్‌పోర్ట్ మీ చేతికి..

By Hazarath
|

మీకు పాస్ పోర్ట్ లేదు. కాని మీరు అత్యవసరంగా విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇటువంటి సంధర్భంలో మీకు చాలా చికాకు కలుగవచ్చు...అప్పటికే మీరు పాస్ పోర్ట్ అప్లయి చేసినా కాని పోలీసుల తనిఖీ లాంటి సమస్యలు మిమ్మల్ని ఇంకా వేధిస్తూనే ఉంటాయి. అలాంటి వారు కేవలం మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్‌పోర్ట్ పొందవచ్చు. అదెలాగో చూద్దాం..

Read more : ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేయటం ఏలా..?

1
 

1

నూతన నిబంధనల మేరకు అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన వారు మూడు రోజుల్లోనే పాస్ పోర్ట్ పొందవచ్చు. పోలీసుల తనిఖీ నివేదిక వచ్చే వరకు ఆగకుండా దరఖాస్తు చేసిన వెంటనే జారీ ప్రక్రియను ప్రారంభిస్తారు. మూడో రోజు పాస్ పోర్ట్ ఇంటికి వచ్చేస్తుంది.

2

2

తత్కాల్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మాములుగా పాస్‌పోర్ట్‌కు అప్లయి చేసే విధంగానే ఉంటుంది. పాస్ పోర్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో యూజర్‌గా నమోదై అనంతరం లాగిన్ అవ్వాలి.

3

3

అప్లయ్ ఫర్ ఫ్రెష్ ను సెలక్ట్ చేసుకున్న తర్వాత తత్కాల్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత దరఖాస్తును పూర్తి చేసి సబ్ మిట్ చేసి పేమెంట్ చేయాలి.

4

4

అనంతరం ప్రింట్ తీసుకుని అపాయింట్ మెంట్ టైమ్ ను బుక్ చేసుకుని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయానికి అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది.

5
 

5

ధ్రువీకరణ పత్రాలంటే వెరిఫికేషన్ సర్టిఫికెట్. లేదా ఓటర్ ఐడీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసిన ఉద్యోగ ఐడీ కార్డు, ఇంకా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్, పుట్టిన తేదీ ధ్రువీకరణ, గ్యాస్ కనెక్షన్ బిల్లుల్లో మూడింటిని సమర్పించాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి ఫొటో ఐడీ ఉండాలి.

6

6

అలాగే అనెక్స్యూర్ 1 ప్రకారం స్టాంపు పేపర్ పై నోటరీ అఫిడవిట్ ను సమర్పించాలి. ఆన్ లైన్ అప్లికేషన్ ప్రింటవువట్, పేమెంట్ రిసీప్ట్, కలర్ ఫొటో ను కూడా తీసుకెళ్లాలి.

7

7

అత్యవసరంగా పాస్ పోర్ట్ ఎందుకు అవసరమో తెలియజేసే పత్రాలు సమర్పించాల్సిన నిబంధన ఏదీ లేదు. కానీ అత్యవసరమన్న విషయం పాస్ పోర్ట్ అధికారికి అర్థమయ్యేందుకు వీలుగా ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకెళ్లడం మంచిది. అన్ని ఒరిజినల్స్, ఒక సెట్ జిరాక్స్ కాపీలు (స్వయంగా సంతకం చేసినవి) తీసుకెళ్లాలి.

8

8

మీరు విదేశాలకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో తెలియజేసే పత్రాలను మీరు సమర్పిస్తే మీకు తత్కాల్ పాస్‌పోర్ట్ వీలయినంత త్వరగా మీ చేతికి వచ్చే అవకాశం ఉంది.

9

9

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Most Read Articles
Best Mobiles in India

English summary
Here Write Now get new passport in three days: Regional Passport Office

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X