ఇప్పుడు ఆధార్ ఉంటే క్షణాల్లో మొబైల్ కనెక్షన్

By Hazarath
|

మొబైల్ కనెక్షన్లను మరింత సులభంగా పొందేందుకు గుర్తింపు కార్డుగా ఇప్పుడు ఆధార్ ని ఉపయోగిస్తే చాలు. ఈ మేరకు మొబైల్ కనెక్షన్‌ కోసం ఆధార్‌ను ఈ కేవైసీగా పరిగణిస్తూ టెలికం శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలతో వినియోగదారులు ఆధార్ కార్డుతో వెళ్లి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్ కార్డులను సత్వర యాక్టివేషన్‌తో పొందవచ్చు. ప్రస్తుతం కొత్త సిమ్ కార్డు కోసం ఫొటో ఐడీ, చిరునామా ఐడీ, పాస్‌పోర్ట్ ఫొటో వంటివన్నీ వెంట తీసుకెళ్లి దరఖాస్తు పూరించి ఇచ్చినప్పటికీ ఒకటి, రెండు రోజులకు గానీ యాక్టివేట్ కావడం లేదు.ఇప్పుడా ఆ బెంగ తీరనుంది.

aadhaar

యూఐడీఏఐ నుంచి ఆధార్ నంబర్ ఆధారంగా పేరు, చిరునామా, ఇతర వివరాలన్నీ ఆపరేటర్లకు వెళతాయి. వాటిని ఆపరేటర్లు తమ డేటాబేస్‌లో భద్రపరచుకుంటే సరిపోతుంది. ఆధార్ ఆధారిత ఈ కేవైసీ విధానాన్ని ఈ వారంలోనే అమల్లోకి తెస్తామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. వొడాఫోన్ సైతం సానుకూల చర్యగా పేర్కొంది.

ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఇప్పుడు మీరు ఆధార్ కార్డు మార్పులు చేర్పులు చేయవచ్చు. మీరు ఇంతకుముందు ఇచ్చిన సమాచారంలో ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మీరు ఆధార్ సెంటర్లకు తిరగనవసరం లేదు. కేవలం మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు.

 మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

https://ssup.uidai.gov.in/web/guest/update వెబ్ సైట్ లోకి వెళ్లాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద నల్లటి అక్షరాల్లో కనిపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ను టైప్ చేయాలి. అక్కడ మీకు సెండ్ ఓటీపీ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేస్తే తర్వాతి పేజీకి వెళతాం.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

ఇక్కడ పేరు లేదా చిరునామా, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ... వీటిలో మార్చాల్సిన వాటిని సెలక్ట్ చేసుకుని వివరాలు ఇంగ్లిష్ లేదా ప్రాంతీయ భాషలో నమోదు చేయాలి. మార్చిన వివరాలకు ఆధారంగా ఏదేనీ డాక్యుమెంట్ కాపీ సమర్పించాల్సి ఉంటుంది.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

చిరునామాలో మార్పు అయితే కొత్త చిరునామాను తెలియజేసే డాక్యుమెంట్ జిరాక్స్ కాపీపై సెల్ఫ్ అటెస్టేషన్ తో స్కాన్ చేసి దాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా యూటీఆర్ నంబర్ రాసి పెట్టుకుంటే తర్వాత విచారణకు ఉపకరిస్తుంది.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

కొత్త వివరాలు ఆధార్ లో చోటు చేసుకున్నాయా .. లేదా అనే దానిని పరిశీలించేందుకు https://ssup.uidai.gov.in/web/guest/check-status సైట్ కు వెళ్లాలి. ఆధార్ నంబర్, యూఆర్ఎన్ నంబర్లను నమోదు చేసి గెట్ స్టేటస్ బటన్ క్లిక్ చేసే స్టేటస్ వస్తుంది. వెయిటింగ్ అప్రూవల్ లేక అప్రూవల్ అయిందా అన్నది తెలుస్తుంది. అప్రూవల్ ముగిస్తే నూతన ఆధార్ కార్డును ఈ కార్డు రూపంలో పొందవచ్చు.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

ఇందుకోసం https://eaadhaar.uidai.gov.in/ సైట్ ఓపెన్ చేయాలి. ఎన్ రోల్ మెంట్ నంబర్, లేదా ఆధార్ నంబర్ ఏది ఉంటే దాన్ని పైన సెలక్ట్ చేసుకుని ఆ నంబర్ ను కిందనున్న కాలమ్ లో ఎంటర్ చేయాలి.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

పూర్తి పేరు. పిన్ కోడ్, తర్వాత కాలమ్ కింద కనిపించే అక్షరాలు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. గెట్ వన్ టైమ్ పాస్ వర్డ్ క్లిక్ చేస్తే మొబైల్ కు పాస్ వర్డ్ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే పీడీఎఫ్ రూపంలో ఆధార్ డౌన్ లోడ్ అవుతుంది.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

ఆధార్ కార్డు తీసుకునే సమయానికి ఇచ్చిన మొబైల్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకుంటే ఆన్ లైన్ లో ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే, అప్ డేట్ చేసుకునే ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాని ద్వారానే ముందుకు వెళ్లడం సాధ్యం అవుతుంది.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మీ దగ్గరే ఉండి, కొత్త మొబైల్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవాలంటే మాత్రం సాధ్యమవుతుంది. అటువంటి వారు సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఆధార్ వివరాల అప్ డేట్ కాలమ్ లోనే మొబైల్ నంబర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

ఒకవేళ కార్డు తీసుకునే సమయంలో ఇచ్చిన నంబర్ మారిపోయి ఉంటే దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలి. లేదా పోస్ట్ ద్వారానూ దరఖాస్తు పంపవచ్చు.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

చిరునామా 1: యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ నెం 10, చింద్వారా, మధ్య ప్రదేశ్ - 480001, భారతదేశం.
చిరునామా 2: యుఐడిఎఐ, పోస్ట్ బాక్స్ No.99, బంజారా హిల్స్, హైదరాబాద్ - 500034, భారతదేశం.

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

కవర్ పైన స్పష్టంగా ఆధార్ అప్ డేట్ / కరెక్షన్ అని రాయాలి. అలాగే, పంపేవారి చిరునామానూ తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పత్రాన్ని కూడా జతచేయాలి.

Best Mobiles in India

English summary
Here Write Now Government allows new mobile connections with just Aadhaar e-KYC

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X